Click here for - అమెరికా 7
మాస్టరుగారికి ఈరోజు పుట్టినరోజుట. చాలా ప్రసన్నంగా, సంతోషంగా ఉన్నారు ఆయన.
నిన్న యింటికి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి 7 గంటలకి ఒక నాట్యం క్లాసు చూసేం. హవాయిన్ డాన్స్ క్లాసు. ఆడామగా చాలామంది ఉన్నారు శిష్యులు. డాన్సుకి అనుకూలమయిన తెల్లని దుస్తులు వేసుకొంటారు. ఈ డాన్సు పేరు హులా*. న్యాయంగా ఆహర్యంగా ఆకులు, రెమ్మలు, పువ్వులే దుస్తులుగా ధరించాలిట. ఎక్కువ వాద్యాలు లేవు. ఒక ఆనపకాయ తుంబ. దానినే తాళవాద్యంగా ఉపయోగిస్తారు. ఒక చండ లాటి చర్మవాద్యం కూడా ఉంది. ఆ నాట్యం కూడా సంవత్సరాల తరబడి శ్రద్ధగా నేర్చుకుంటారుట.
మరో చిత్రమమయిన
అలవాటు. హవాయిన్లు అందరూ కలుసుకోగానే ముద్దు పెట్టుకొంటారు. చిన్నా పెద్ద అంతా.
నిన్న
మాస్టారుగారికి చాలా దండలు వేసేరు. ఆయన మాకు అందరికీ దండలు తిరిగి వేసేరు.
జ్ఞాపకచిహ్నంగా ఆ దండని ఎండలో పెట్టి నిలవ చేద్దామనుకొంటున్నాను. ఇక్కడ దండలు
వేస్తే మన దేశంలోలా వెంటనే తీసివేయరు ఏదో పురుగు పడ్డట్టు. హవాయ్ లో దండలు
వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ దేశంలో అడుగుపెట్టగానే అందరూ దండలు వేసుకోడమే
మొదట.
ఈవాళ, అంటే 2వ తేదీ
అన్నమాట, మార్తా, ఆమె సహచరి సముద్ర స్నానాలకి వెళ్లేరు. మేము ఇక్కడ ఉన్న షాపులలో
తిరగడానికి వెళ్లి వచ్చేం కొన్ని గంటలు. రేపు రాత్రి Portland వెళతామట.
*Hula
Hula in Honolulu is a vital cultural practice, blending traditional (kahiko) and modern ('auana) styles to share Hawaiian stories, history, and genealogy. Key experiences include free nightly shows at Kuhio Beach (Tues/Sat), daily performances at Ala Moana Center, the new Kilohana Hula Show at the Waikiki Shell, and immersive lūʻau. YouTube +7
https://youtu.be/UpzXrAYpUhA?si=QFoy8jtYfuUxQzy9
Hula in Honolulu features a mix of traditional percussive instruments for kahiko (ancient) dance and Western-influenced instruments for 'auana (modern) dance. Core instruments include the ipu (gourd drum), pahu (sharkskin drum), 'ulī'ulī (feathered rattles), pū'ili (bamboo sticks), kāla'au (rhythm sticks), and ukulele. Wikipedia +4
This video demonstrates how to play the 'ulī'ulī, a feathered gourd rattle used in both modern and ancient hula:
https://youtu.be/St8aQTimf20?si=4U4FWMUJtJyssPLk
.jpg)




