Click here for - అమెరికా 1
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను.
- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి
అమెరికా - 2
మళ్లా టలహస్సీకి
వద్దాం.
Tallahassee
లో గొప్ప యూనివర్సిటీ ఉంది. 2000 మంది students ఉన్నారట. ప్రభుత్వోద్యోగులు,
విద్యార్థులు మాత్రమే అక్కడ జనాభా. ఒక బెంగాలీ professor
యింట్లో మొదట. తరవాత, మర్నాడు, సేతురామన్ అని వాళ్లింట్లో. ఆ రోజు
శివరాత్రిట. మొత్తానికి
వాళ్లింట్లో మద్రాసు భోజనమే. అక్కడ తెలుగు ఆయన తన దగ్గర ఉన్న సూట్లు యిచ్చేడు. నేనొక
కోటు, షర్టు పుచ్చుకొన్నాను. ప్రయాణంలో ఎందుకైనా మంచిదని. చాలా పెద్ద సైజు.
సరీగా టలహస్సీ నుంచి
ఉదయం పది గంటలకి బయలుదేరి అట్లాంటా మీదుగా షార్లట్ – Charlotte – వచ్చేం.
ఇక్కడ Davidson College లో మా బస. ఇక్కడ
గుజరాతీ వాళ్లు ఉన్నారు. అయితే వాళ్లంతా కెన్యా, South Africa దేశాలనుంచి వచ్చిన
వాళ్లట. చాలామంది గుజరాతీలు యిక్కడ motel
business చేస్తున్నారు.
ఇవాళ 12వ తేదీ.
రాత్రి 8.15 కి మా కార్యక్రమం. టలహస్సీ లో శ్రీ చిన్న సత్యంగారి demonstration బాగానే వచ్చింది.
ఈవాళ మరో మాట విన్నాను. ఏప్రిల్ లో రావలసిన మణిపూర్ డాన్సు రద్దు చేదామనుకొంటూ
ఉంది Martha. April లో కూడా మేమే కార్యక్రమాలు యిస్తే బాగుంటుందని ఆవిడ ఉద్దేశం. అంతేకాదు, కుమారి కమలారెడ్డి, కుమారి సబితల కార్యక్రమం కోసం
శ్రీ KV రావు, చలికొండ
రామకృష్ణల ద్వారా తను ప్రయత్నం చేస్తున్నారు. న్యాయంగా ఏప్రిల్ 7 వ తేదీని
బయలుదేరి యిండియా వెళ్లాలి. యిప్పుడు మరో నెల కావచ్చును.
Charlotte
అన్నది North
Carolina అనే రాష్ట్రానికి
ముఖ్యపట్నం. అక్కడే Davidson College ఉంది.



ఈ కాలేజీ guesthouse లోనే ఈ నాలుగు
రోజులూ ఉన్నాం. ఇక్కడ ఉన్న భారతీయులు రెండు రోజులు భోజనానికి తీసుకొని వెళ్లేరు.
ఇక్కడ students భోజనశాలలో మిగిలిన రోజులు గడిచేయి. చాలా ప్రశాంతంగా. నిన్న, అంటే 14 మార్చ్,
10 గంటలకి బయలుదేరి Nashville మీదుగా Memphis వచ్చేం. ఇక్కడ భారతీయుల యిళ్లలోనే ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉన్నాం. ఇక్కడ తెలుగు కుటుంబం బందరు ప్రాంతం వారే. గోపాలమూర్తిగారు.
వారింట్లోనే శ్రీ వేదాంతం సత్యనారాయణశర్మగారు, నేను, మాణిక్యాలరావు, గోవిందరాజన్
ఉన్నాం. ఇంటి ఇల్లాలు అరుణ, MA Ph.D.
Memphis లో ఆసన్ తేజువాని అనే ఆయన సింధీ అనుకొంటాను, Indian American Forum అనే సంస్థ అధ్యక్షుడు. సరీగా పెద్ద సైజు TVK శాస్త్రిలా ఉన్నాడు. ఆయన భార్య మంచి డాక్టరుగా పేరుందిట. మా కార్యక్రమం శ్రీ
తేజువాని ఆధ్వర్యంలో జరిగింది. మర్నాడు తెలుగు అసోసియేషన్ వారు brunch ఏర్పాటు చేసేరు. Brunch అంటే Breakfast-Lunch కలిపి చేయడం అన్నమాట.
తేజువానిగారింట్లో అందరికీ dinner, కొంతసేపు సంగీత గోష్ఠి.
తేజువాని అందరికీ స్మారక చిహ్నలుగా పుస్తకాలు, 20 డాలర్లు, కాస్మొటిక్సు యిచ్చేరు.
మర్నాడు ఉదయాన్నే airportకి వచ్చేసాం.