Saturday, May 16, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 4

 

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ –3

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 4

ప్రాగ్

27-4-89

ఈరోజు కార్యక్రమం లేదు. మేము ఉండేది Intercontinental Hotel. భోజనానికి కల్చరల్ పేలస్ ఉండే భవనంలోనే Panorama అనే రెస్టారెంట్ ఉంది. అక్కడకి మా స్వంత బస్సులో తీసుకొని వెళ్లేవారు. మొదటిరోజు భోజనం అన్నీ ఆకుకూరలే. Bread, butter, jam అన్నీ ఉన్నాయి. తర్వాత ఉడికీ ఉడకని అన్నం, yogurt, ఉడికించిన కూరలు, cakes, ఏవో అవి ఇవీ యిస్తున్నారు. నిన్న ఏదో పోతులాటి cutlet లాంటిది యిచ్చేరు. ఇదీ మా భోజనం సంగతి.             

26వ తేదీ దాకా వాతావరణం వెచ్చగా బాగుంది. హటాత్తుగా 27 ఉదయానికి మారిపోయింది. వర్షం చలి. 26న (నిన్న) కచేరీకి వెళ్లినప్పుడు  లోపల వేసుకొనే ఉన్ని షరాయి, కోటు వేసుకొన్నాను. (ఆ రోజు) చాలా వేడిగా ఉంది. ఈ బట్టలు అనవసరం అనిపించింది. ఈ రోజు బయటికి వెళ్లాలంటే చలి బట్టలు వేసుకోవలసిందే. ఊరు మధ్యనుంచే ఒక నది ఉంది. దాంట్లో నౌకలు, ఓడలు కూడా నడుస్తున్నాయి.   

  


Vltava River - Prague

ఆ నది పేరు అడిగేను. సరిగా తెలియలేదు. విల్ తవా *1  అని అనుకున్నాను. నిజమే.

The Vltava as it flows along the north side of central Prague, taken from the Stalin Monument socle in Letná Park

మధ్యాహ్నం, రాత్రి భోజనానికి తిరగడానికి సరిపోయింది. భోజనం దగ్గర, రాత్రి, శరన్ రాణి. ఆవిడ బృందం ఎక్కువ లేరు. తబలా, తంబురా వాద్యకులు మాత్రం. ఆవిడ యౌవనం నిలుపుకుందామని తాపత్రయపడే వృద్ధవనితలా ఉంటుంది. కొంచెం వాగ్ధోరణి, విమర్శ ఎక్కువ. అందరినీ patronize చేసే హావభావాలు. ఆవిడ పూర్తి శాఖాహారి. ఆవిడ అనుచరులు పూర్తి మాంసాహారులు.

రాత్రి మరో 340 క్రౌనులు యిచ్చేరు.

*1The Vltava (/ˈvʊltəvə, ˈvʌl-/ VU(U)L-tə-və, Czech: [ˈvl̩tava]  GermanMoldau [ˈmɔldaʊ] ) is the longest river in the Czech Republic, a left tributary of the Elbe River. It runs southeast along the Bohemian Forest and then north across Bohemia, through Český KrumlovČeské Budějovice, and Prague. It is commonly referred to as the "Czech national river"

Etymology

Both the Czech name Vltava and the German name Moldau are believed to originate from the old Germanic words *wilt ahwa 'wild water' (compare Latin aqua). In the Annales Fuldenses (872 AD) it is called Fuldaha; from 1113 AD it is attested as Wultha. In the Chronica Boemorum (1125 AD) it is attested for the first time in its Bohemian form, Wlitaua