Saturday, July 25, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 4 - USA - 3

Click here for నా విదేశపర్యటనలు – 4 – USA – 1

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 4 – USA – 2

Philadelphia

19-8-94

ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియాలో మరో నగరం. ఈ ఊళ్లో ఎవరింట్లో ఉన్నామో జ్ఞాపకం లేదు. ఎవరింట్లో ఉన్నా ఒకే తరహా భోజనం నిద్రాను. ఉన్నంత వరకూ వాంతా ఎంతో ఆదణగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ శివదనుర్భంగం బాగా రక్తి కట్టింది. మర్నాడు న్యూజెర్సీ ఉదయం 11 గంటలకి. అనుకొన్న సమయానికి హైస్కూలు ఆడిటోరియం దగ్గర ఎవరూ నిర్వాహకులు రాలేదు. హైస్కూలు ముందు కొంత ఆవరణ ఉంది. ప్రహారీ గోడ లేదు. ఈలోగా అంటే పావు గంట తర్వాత ఒకాయన వచ్చేరు. మాకు తాగడానికి coke యిచ్చేరు. న్యూయార్క్ వరకు శ్రీ పప్పు వేణుగోపాలరావుగారు ఉండి మా కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఉండేవారు. బస్సులో మా పెట్టెలు ఉన్నాయి కదా. ఆ పెట్టెలతో hosts యింటికి వెళ్లడం శ్రమ. అందుచేత రెండు రోజులకి కావలసిన బట్టలు తీసుకొండి యిక్కడే అని వేణుగోపాలరావుగు తెలియజేసేరు. పొలోమని అందరం బస్సులో సామాను తీసుకొని పెట్టెలు విప్పి హైస్కూలు ఆవరణలోనే అంటే pubic road సమీపంగా సర్దుకొంటున్నాం. ఇంతలో ఒక ఉరుము ఉరిమింది. మాస్టరుగారి గర్జన అది. బుర్ర తక్కువ పనులు. రోడ్డుమీద సర్దుకొడం ఏమిటి. లోపలికి పొండి, అన్నారు. వారు చెప్పేవరకు హైస్కూలు ఆడిటోరియం తలుపులు తెరవలేదు. ఆడపిల్లలు, పెద్దింటి పిల్లలు రోడ్డుమీద పెట్టెలు సర్దుకోవలసిన పరిస్థితి మాస్టరుగారికి దుర్భరం అనిపించింది. ఈ కార్యక్రమం ఏర్పాటుచేసిన కార్యకర్తలమీద ఏవో వాక్బాణాలు వేసేరు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింద ఎవరో కాదు, మాస్టరుగారి హితైషులు, శ్రీ చలికొండ రామక్రిష్ణగారూ, కిడాంబి రఘునాథ్ గారూను.

భోజనాలు చేసుకొని, వెంటనే make-up లు చేసుకొని 6 గంటలకి ప్రదర్శనకి సిద్ధంకావాలని చెప్పేరు. అన్నీ అలాగే జరిగేయి. జరిగిన కార్యక్రమాల అన్నీ రక్తిగానే నడేచేయి. రాత్రి శ్రీ చలికొండ రామక్రిష్ణగారింట్లో మాస్టరుగారు, వారితో శశికళ, కల్పలతిక యిత్యాదులు కొందరు. మరికొంతమంది hosts మిగతావాళ్లని వాళ్ళవాళ్ల యిళ్లకి తీసుకొని వెళ్లేరు. సూర్యారావుగారు, నేను, ప్రకాశరావుగారు రఘునాథ్ గారింట్లో. ఆ రాత్రి మాట్లల్లో రఘునాథ్ గారు అడిగేరు మాస్టారుగారి ఆరోగ్యం గురించి. సూర్యారావుగారు శ్రీమతి రఘునాథ్ గారికి సంగీత విద్యా గురువు. వారింట్లో మేము సుఖంగా గడిపేం. శ్రీ చిత్తరంజన్ గారు కూడా ఆ మర్నాడు రఘునాథ్ గారింట్లోనే బస.

20-8-94

తరవాత మర్నాడు (20న అనుకుంటాను) న్యూయార్క్. మధ్యాహ్నం భోజనం న్యూయార్క్ temple లో. కాదుకాదు, అదేదో థియేటరు.లోగడ ఎప్పుడో గొప్ప ఎగ్జబిషన్ జరిగిన సందర్భంలో కట్టినది. అక్కడికే అందరం చేరేం. కార్యక్రమం అయిన తరవాత temple లో భోజనం. తర్వాత hosts యిళ్ళకి వెళ్లడం. ఆరాత్రి వర్షం. ఈ వర్షం అలా ఏదో వేళ పడుతునే ఉంది. కెనడా వచ్చినా వదలలేదు. న్యూయార్క్ లో శ్రీ శ్రీనివాసమూర్తిగారింట్లో మాస్టరుగారు, నేనూ ఉన్నాం. ఆయన డాక్టరు. ఆయన భార్య సైంటిస్టు. ఆయనది పర్లాకిమిడి ట. వెంటనే నేను బంధుత్వం కలిపేశేను. అతనికి భళ్లమూడి సీతారామమూర్తిగారు, ...

30-10-94

కస్తూరి సతీష్. విశాఖపట్నం చెందినవారు టలహస్సీలో వారింట్లోనే ఉన్నాం. వారింట్లో మంచి వీణ ఉంది. ఆయన భార్య కూడా విశాఖపట్నమే. చాలా మంచి మనిషి. నా యడల చాలా గౌరవం చూపించేరు. వెళ్లేటప్పుడు ఒక కవరు యిచ్చేరు. దానిలో 40 డాలర్లు ఉన్నాయి.     

---

అర్ధాంతరంగా ఇక్కడితో నాన్నగారి విదేశపర్యటనా అనుభవాలు ఆగిపోయాయి.

తరవాత పేజీల్లో ఇతర వ్యాసాలు మరింకేవో ఉన్నాయి. 

Saturday, July 18, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 4 - USA - 2

Click here for నా విదేశపర్యటనలు – 4 – USA – 1

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 4 – USA – 2

Philadelphia

State of Pensilvania

అమెరికన్ వాతావరణం గురించి ఒకలా అనిపిస్తుంది నాకు. ఇండియా వాతావరణం మాసిన బట్టలా ఉంటే, అమెరికన్ వాతావరణం ఇస్త్రీ మడతలా ఉంటుంది. ప్రకృతి అంతా కన్నుల పండువుగా ఉంటుంది. అందులోనూ పెన్సిల్వేనియాలో. అమెరికాలో చూడవలసినవి అన్నీ చాలా సార్లు చూసేం. అయితే అమెరికన్ జీవితం యింకా అనుభవించడానికి ఎంతో ఉంది. వెళ్లిన 32 మంది 5 కుటుంబాలలో స్థిరపడ్డాం. పిట్స్ బర్గ్ దేవాలయానికి అందరి యిళ్లూ కారు మీద గంట ప్రయాణానికి తక్కువలేదు. యిళ్ల నుంచి గంట ప్రయాణానికి తక్కువ పట్టదు.

మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, కాఫీలు మొదలగు మధ్య మధ్య పానీయాలతో రిహార్సల్స్ పూర్తి చేసుకొని రాత్రికి ఆయా గృహస్థులు మమ్మల్ని, వాళ్లని తీసుకొని వెళతారు. వారం, పదిరోజులయింది. పిట్స్ బర్గ్ జీవితం. శ్రీ గర్తి వరప్రసాదరావుగారింట్లో నేను, శ్రీ మాస్టారుగారు, శశికళ, కల్పలత యింకా మరో నలుగురు అమ్మాయిలు ఉన్నాం. శ్రీ వరప్రసాదరావుగారు పిట్స్ బర్గ్ దేవాలయ నిర్మాతలలో, నిర్వాహకులలో ప్రధానులు. వారిల్లు అమెరికాలో ఉన్న మనవాళ్లకే beautiful house. ఆయన భార్య శ్రీమతి పార్వతిగారూ బహుసౌమ్యురాలు. వాళ్ల అమ్మాయి బిందు, అబ్బాయి వాసు. బిందు నాట్యంలో నిలబడగలదు. వాసుకు మంచి అవగాహన ఉంది. సరీ – నిజానికి నాకు లోగడ అమెరికా వచ్చినప్పుడు శ్రీ నున్న నాగభూషణంగారు, వారి సతీమణి సీతగార్లతో సాన్నిహిత్యం, ఆదరణ లభించింది. ఈసారి వారిని శివదనుర్భంగం, అర్ధనారీశ్వర ప్రదర్శనలలో మాత్రం చూసేను. ఏదో తెలీమధ్యను ఉందనిపించింది.

అర్ధనారీశ్వరం 6 తేదీని ప్రారంభ పూజా సందర్భంలో ప్రదర్శించబడింది మొదటిసారిగా. చిll రవి బాగా చేసేడని అనుకొన్నారు. రక్తి కట్టింది. 8 తేదీ శివదనుర్భంగం గర్వకారణంగా ప్రదర్శంచబడింది. Norfolk*1  లో కూడా రామాయణమే (శివదనుర్భంగం). అందరూ ఎంతో ఆసక్తిగా, సంతృప్తిగా ప్రదర్శనం చూసేరు. ఆ రాత్రికాదు మర్నాటి రాత్రి ఎవరో గుజరాతీ ప్రముఖుని యింట్లో get together. అందరూ పాడేరు. నేనూ పాడేను. న్యాయంగా అక్కడనుంచి Yogaville*వెళ్లవలసి ఉండెను. యోగావిల్’ భారత సంస్కృతీ కేంద్రంట. అక్కడ వాళ్ల వాళ్ల విద్యలు ప్రదర్శించగలగడం గొప్పట. అయితే మా అందరికీ తగిన వసతులు ఏర్పాటు చేయడం వాళ్లకి కుదరట. ఏమయితేనేమి, మళ్లా మేము పిట్స్ బర్గు వెంకటేశ్వరస్వామి అండ చేరేం. మధ్య ఒకరోజు రామాయణం cassette ముందు title music ‘బాల కనకమయ చేల’ పల్లవి రికార్డింగు జరిగింది. మధ్యాహ్నం హరవిలాసం రిహార్సల్సు. నిన్న మధ్యాహ్నం భోజనం చేసి సొంత బస్సులో మళ్లా బయలుదేరేం. సాయంత్రం అంటే 18-8-94 6 గంటలకి ఫిలడెల్ఫియా చేరేం. ఈరోజు మళ్లా శివదనుర్భంగం. రేపు న్యాజెర్సీ, ఎల్లుండి న్యూయార్కు. అక్కడనుంచి కెనడా.   

Yogaville - Virginia

Norfolk - Virginia

*1 Norfolk, Virginia, is a historic, majority-minority independent city of about 235,000 residents, located at the mouth of the Chesapeake Bay in the Hampton Roads metropolitan area. Known as the cultural and urban heart of Coastal Virginia, it is uniquely famous for housing the world's largest naval base and the USS Wisconsin battleship.

 *2 Yogaville, or Satchidananda Ashram, is the Buckingham County, Virginia headquarters of Satchidananda Saraswati's organization.

The ashram was founded in 1980 by Satchidananda Saraswati, whose western notability stems from his opening of the Woodstock festival. The ashram is the international organizational headquarters of Swami Satchidananda's documented teachings. It is located in Buckingham County, Virginia. The primary goal of guru Yogiraj Sri Swami Satchidananda (1914-2002) was interfaith understanding as a vehicle to world peace. To this end, the LOTUS (Light Of Truth Universal Shrine) was constructed and inaugurated in 1986. Swami Satchidananda had been living in Yogaville, though he was visiting Madras, in South India at the time of his death.  

Saturday, July 11, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 4 - USA - 1

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 10

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 4 – USA – 1

Philadelphia*

19-8-94

ఈరోజు శ్రావణ శుక్రవారంట. ఈ యింటి ఆమె మేము లేచేసరికి వరలక్ష్మి పూజ చేస్తోంది ఇండియా నుంచి తెచ్చుకొన్న వరలక్ష్మివ్రతం cassette పెట్టుకొని. ఇంటి ఆయన మద్రాసేట. వెంకట నారాయణా రోడ్డులో. ఆ అమ్మాయిది విశాఖపట్నం. చిత్రం, వాళ్ల పేర్లు తెలియవు నాకు.

ఇలాంటి మా పర్యటనలలో ఎంతోమందిని కలవడం, వాళ్ల ఆతిథ్యం పొందడం, కలిసి ఉన్న ఆ కొద్ది గంటలూ ఎంతో ఆత్మీయంగా ఉండడం జరుగుతుంది. తరవాత వాళ్లు ఎవరో మనం ఎవరో.

మనవాళ్ల అమెరికన్ జీవితంలో పూజలు ఒక భాగం. ఇల్లు దాటితే మరో ప్రపంచంలో బతకాలి. అందుచేత ఉన్న కొద్ది గంటలూ ఇండియాలోనే ఉన్నామనే భ్రమ కలిగించుకొంటారనుకొంటాను.

ఆయన పేరు కనుమల రమణ. ఆ అమ్మాయి, ఆయన ఇద్దరూ ఆఫీసులకి పోయేరు. వెళ్లేముందు నా యడ్రసు రాసుకొన్నారు. వంటయిల్లు శశికళ, కల్పలత స్వాధీనం చేసుకొన్నారు. శ్రీ మాస్టరుగారు పర్యవేక్షిస్తున్నారు. నేను తామరాకు మీద నీటిబొట్టులా ఉన్నాను. భోజనభాజనాల్లో మాత్రం కాదు.

ఆగస్టు 1 తేదీ రాత్రి అంటే 2 తేదీ 2 గంటలకి మద్రాసులో బయలుదేరి బొంబాయిలో మారి 2 తేదీ సాయంత్రానికి న్యూయార్క్ చేరేం. విమానంలో కూర్చుని కూర్చొని కాళ్లు బిగుసుకుపోయేయి. న్యూయార్కులోని దేవాలయంలో మాకు భోజనాలు. అక్కడనుంచి బస్సులో పిట్స్ బర్గు చేరుకొన్నాం. ఈ న్యూయార్క్ కోవిల, అక్కడ శ్రీ KV రావుగారూ, శ్రీ చలికొండ రామక్రిష్ణగారూ చాలా కాలంగా తెలుసును.

Skyline of Philadelphia Center City

* Philadelphia, famously known as the "City of Brotherly Love," is Pennsylvania's most populous city and the nation's sixth-most populous. Located in the northeastern United States, it is celebrated as the birthplace of American democracy and serves as a major cultural, historical, and economic hub.

Saturday, June 27, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 10

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 9

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 10

బుడాపెస్ట్

5 -5-89

ఉదయం సక్రమంగా 8 గంటలకి బయలుదేరేం. బుడాపెస్ట్ దారిలో borders దగ్గర మా passports తనిఖీ జరిగింది. అక్కడికి దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో బుడాపెస్ట్. 11 గంటలకి బుడాపెస్ట్ చేరుకొన్నాం. కాలమానం జెకొస్లోవేకియా, హంగేరీ ఒక్కలాగే ఉంది. బుడాపెస్ట్ లో మాకు గదులు ఏర్పాటు చేయబడిన హోటేలు ముందు బస్సు ఆగింది. ఇక్కడ సామానులు గదిలో పెట్టే porters లేరు.  మేమే హోటేలు రిసెప్షన్ దాకా తెచ్చుకొన్నాం. అయితే ఇండియన్ రాయబార కార్యాలయం నుంచి గాని హంగేరీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి గానీ ఎవరూ మాకు స్వాగతం చెప్పలేదు. తర్వాత తెలిసింది మేము జకొస్లోవేకియా Bratislava  నుంచి విమానంలో వస్తామని ఆ విమానం మధ్యాహ్నం 2 గంటలకి వస్తుందని వాళ్లు రాలేదుట. ఏదో జరిగింది పొరపాటు. మాతో అంపకం పెట్టడానికి వచ్చినది మార్తా, లోచికా, డ్రయివరు – ఈ డ్రయివరు ఆ యిద్దరు ఆడవాళ్లకి సలహా, సహాయం చేస్తూ పెద్ద మనిషి తరహాగానే ఉంటూ వచ్చేడు. బస్సులో వాళ్ల భాషలో ఆ ఆడవాళ్లతో ఏవో ఎడతెగని కబుర్లు చెప్పేవాడు. అతడు నిండైన మనిషి. చిరునవ్వు. సహాయపడే లక్షణం. యివీ.

ఆ ముగ్గురూ మమ్మల్ని గదులలోకి సాగనంపే వరకూ ఉన్నారు. అయితే వాళ్లు తిరిగి పోడానికి బస్సు ఉంది, కానీ భోజనం మాతోటో చేసి వెళ్లాలంటే హంగేరీ డబ్బు లేదే. మాస్టారు ఏమైనా వాళ్లని మాతోటే భోజనం చేయాలనీ, అవసరం అయితే అమెరికన్ డాలర్లు ఉన్నాయని, ఫరవాలేదని అన్నారు. ఈ మాటలకి మార్తా కన్నీళ్లు పెట్టుకొంది. ఇలాంటి సందర్భాలలో మాస్టరుగారు అసాధారణమైన ఔదార్యం చూపించడం ఉంది. తర్వాత మా భోజనం సమయంలో Indian Embassy నుంచి మనుషులు వచ్చేరు. కార్యక్రమం వివరించేరు. మార్తా, లోచికా, డ్రయివరు వెళ్లిపోయారు.

రాత్రి యిండియా రాయబార కార్యాలయంలో డిన్నరు. రాయబారి పేరు శ్రీవాత్సవ. కుర్రవాడే. స్పష్టంగా, హితవుగా మాట్లాడేడు. మీర హోటెలులో comfortable గా ఉన్నారా అని అడిగేడు. అతను అన్నది ఈయన వినిపించుకొంటేనా... వెంటనే no అన్నారు. అతను బిత్తరపోయేడు. వెంటనే మాస్టరుగారిని మేలుకొలిపేరు అమ్మాయిలు. తర్వాత ఏదో సర్దుకొన్నారు. ఇక్కడ రాయబారికి ఉండే ప్రాధాన్యం ఎటువంటిదో తెలియదు. ఎవరో హంగేరీ దేశస్థులు భార్యలతో వచ్చేరు. ఒకామె, మరియా అని, ఆమె అక్కడ యూనివర్సిటీలో హిందీ చెపుదింట. సంస్కృత శాఖ కూడా ఉందిట. ఆమె సంస్కృతం కూడా చదువుకొన్నా ప్రస్తుతం మరొక హంగేరీ సంస్కృత పండితుడు ఆ శాఖ తీసుకొన్నాడుట.

మేము మొదట రాగానే భారతీయ సంప్రదాయం ప్రకారం జోళ్లు విప్పి ప్రవేశించేం. మాస్టరుగారి అడుగుజాడలలో తర్వాత తర్వాత క్రమంగా వచ్చేరు అందరూ. వాళ్లంతా అభిరుచిని బట్టి విస్కీ, వైను తీసుకొన్నారు. మేము భారతీయ సంప్రదాయం ప్రకారం మంచి తీర్థం పుచ్చుకొన్నాం. లేకపోతే మేమంతా తాగి పడిపోతే మాస్టరుగారు ఒక్కరూమోసకొని తీసుకొని వెళ్లడం కష్టం కదా. అలా అని వారి రసికతకి లోపం లేదు. అది వేరే విషయం. ఇక భోజనం అంత చాలా వరకు మాంసాహారం. ఏదో మాకోసం అన్నం పెరుగు కూడా ఉంది. బాబూ అదీ సంగతి.

ఒక హంగేరీ ఆయన ఇండియా వచ్చేడట. కొన్ని రాష్ట్రాలు ఉత్తరాదిని చూసేడట. దక్షిణాదిని మద్రాసు, మహాబలిపురం, ట్రివేండ్రం అవీ చూసేడట. ఈ మాటలు మాకు చెప్పేసి మరొకరితో మాట్లాడడానికి పార్టీ మర్యాద ప్రకారం వెళ్లిపోయేడు. ఆఖరున బయల్దేరే ముందు ఆ హిందీ సంస్కృత పండితురాలితో రెండు మాటలు ముచ్చటించేను. అబ్బే మాకు వచ్చిన సంస్కృతం అంతా ఇంగ్లీషు వ్యాఖ్యానం మీద ఆధారపడి ఉంది అని అందామె. అయితే కాళిదాసు, జయదేవుడు, వాల్మీకి, భవభూతి, బాణుడు వీళ్ల పేర్లన్నీ ఆవడకి తెలుసును. అంతే కాదు ఉచ్చారణ బాగుంది. ఇంటికి అంటే హోటెలుకి చేరుకొని పడుకొన్నాం.

ఈ హోటెలు గదులలో attached bathrooms లేవు. సాముదాయకంగా ఉన్నాయి. స్నానాల గదులకు తలుపులు లేవు. అలా స్నానం చేయడం ఇక్కడ అలవాటా!

6-5-89   

ఇవాళ ఉదయం ఊరు తిరగడం, వాళ్లిచ్చిన హంగేరీ డబ్బుతో ఏవైనా కొనుక్కోడమూను. వాళ్ళవ్వవలసినదేదో నిన్ననే యిచ్చేశారు. తగిన చిల్లర లేక మాస్టారుగారు ఈ ఉదయం షాపింగ్ సమయం దాకా యివ్వలేదు. మా అందరికీ తల ఒక 300 Forints యిచ్చేరు.

బుడాపెస్ట్ ప్రాగ్ కన్నా పెద్దది. అంతకన్నా చరిత్ర కలది. డాన్యూబ్ నది ఒడ్డునే ఉంది. యూరోపు నగరాలలో కనబడే కట్టడాలు, రోడ్లు, బజార్లు అన్నిటి మాదిరిగానే గంభీరంగా ఉంది. ఇక్కడికి రాగానే చెడిపోయిన పెద్ద కుటుంబానికి చెందినట్టున్నారు ప్రజ. వీలైన చోటల్లా పేకాట. కేకలు, మాట్లాడుకోవడం, యివన్నీ కాస్త భారతీయ ధోరణి స్ఫురింపచేస్తాయి.

డాన్యూబ్ నది ఒడ్డున ఒక చర్చి ఉంది. చర్చి లోపలికి పోలేదు.  

Beautiful view of the Matthias Church

View from Danube in the night

The church

బయట అంతా మన దేవాలయల పరిసరాలలోలాగే దుకాణాలు, పటాలు, దావళాలు, ఏవో బట్టలు, ఇత్యాది. యిక యూరపులో ఏముంది చూడడానికి

ఇక్కడ రోడ్డుమీద ఎంతో మంది ఆర్టిస్టులు కూచుని కావలసిన వాళ్లకి వాళ్ళ రూపచిత్రం వేసి డబ్బు తీసుకొంటారు. ఇక్కడ అడుగడునా వయొలిన్, గిటార్, బేంజో, ఫ్లూటు వాయించేవాళ్లు, ఒంటరిగాగాని యిద్దరు ముగ్గురు కలిసి రోడ్డు మీద సంగీత కాలక్షేపం చేస్తారు. ఒకచోట  గిటారు, ఫ్లూటు బాగా వాయించేరు.

కొన్ని చోట్ల వాద్య బృందంతో పాటలు పాడేరు. ఈ బృందాలు బుడాపెస్ట్ లో చాలా అడుగడుగునా కనిపించేయి.

ఈ వృత్తి భిక్షాటనంలాటిదో అంతకన్నా గౌరవమయినదో తెలియదు. ఒకడు mouthorgan వాయించేడు. ఈ హంగేరీ అంతా జానపద సంగీతానికి, నాట్యానికి నృత్యనాటకానికి ప్రసిద్ధిట. అంతా నవ్వులు, కేకలు, హుషారు. కానీ, ఒక్క మొహంలోనూ ఆలోచన, జిజ్ఞాస, అవగాహన కనిపించలేదు. ఈమాట ఒక హంగేరీ పెద్దమనిషితో అన్నాను. ఆయన కొంచెం నొచ్చుకున్నట్టు అన్నాడు, లేదు, మొదట మీకు అలా అనిపించవచ్చును, కానీ చాలా సున్నితమయినవాళ్లు, సీరియస్ గా జీవితాన్ని చూసేవాళ్లూ చాలా మంది ఉన్నారుఅని.

ఇక మాకు యిచ్చిన డబ్బులతో ఏమి వస్తుందో తెలియదు. ఆఖరికి ఈ మూడు వందల Forints తో రెండు సబ్బులు, ఒక after shave lotion వచ్చేయి. ఇక్కడ Forints మన పావలా విలువట. నాణేలు మాత్రం బాగున్నాయి.

7-5-89  

ఈరోజు ఒక ప్రోగ్రాం ఉంది. బుడాపెస్ట్ కి 100 కిలోమీటర్ల దూరంలో నిన్న మా కార్యక్రమం బాగా నడిచింది. మూడుసార్లు తెర మూసివేసినా ప్రేక్షకులు కరతాళద్వనులు చేయడం మానలేదు, కళాకారుల సందర్శనం కోసం. ఇలా జరగడం ఆ కార్యక్రమ విజయానికి నిదర్శనంట. సాధారణంగా లాంఛనంగా చప్పట్లు కొడతారట. ఇలా వదలకుండా కొట్టడం వాళ్ల రసికతకూ, కళాకారుల విజయానికి తార్కాణం అన్నమాట. అలా జరిగింది నిన్న.

ఈ రోజు కార్యక్రమంతో ఈ సంచార కార్యక్రమం ముగుస్తుంది. రేపు అంటే 8, మధ్యాహ్నం Paris. 9 తేదీని ఢిల్లీ. 10 తేదీ మద్రాసు. 

                                                                -+-

Saturday, June 20, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 9

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 8

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 9

ప్రాగ్

4-5-89

ఈరోజు breakfast తర్వాత మరో చిన్న ఊర్లో మాకచేరీ. మధ్యాహ్నం 1-30కి. తర్వాత తిరిగిరావడం. రేపు ఉదయం బుడాపెస్ట్ వెళతాం. ఇక్కడికి నాలుగు గంటల బస్సు ప్రయాణం. మన బస్సులు కావు. మా పార్టీకి మాత్రం ఒక బస్సు. లోగడ అనుకున్నాను, నేనే కాదు బట్టాచార్య అన్నమాట కూడ అదే. ఏమిటీ? ఖర్చు తక్కువ కోసం మమ్మల్ని Bratislava బయట ఈ చిన్న ఊళ్లో పెట్టేరు. ఇప్పుడు అలా అనిపించలేదు. మా కార్యక్రమాలు ఉన్నఊళ్లు Nove Zamky కి చుట్టు పక్కలనే ఉన్నాయి. డబ్బు ఖర్చు పెట్టుకొందికి కావలసిన సౌకర్యాలూ ఉన్నాయి ఇక్కడ కూడా.

ఉదయం breakfast తీసుకొని వెళ్లిన ఊరు పేరు గలంటా. సరోద్ కచేరీ. రెండవది మాది.

శరన్ రాణి – సరోద్ కళాకారిణి

అన్ని స్థలాల్లోలాగే యిక్కడ కూడా మాకే మంచి మార్కులు.

ఈ గలంటా*1 అనే ఊరు district townమొన్న అంటే 1వ తేదీని వెళ్లిన షెల్లా, ఇవన్నీ దగ్గర దగ్గరగా పాతిక ముప్ఫై మైళ్ల దూరంలోనే ఉన్నాయి.

Galanta - Cityscape

 షెల్లా అనే ఊరు దగ్గర ఒక నది ఉంది. దాని పేరు వాహ్’.

River Vah – Sala

మాతో వచ్చిన ముగ్గురు మహిళల పేర్లు – ఒకామె మార్తా. ఈవిడే ఏజన్సీ ఆఫ్ Arts లో ఉద్యోగిని. స్టేజీ మీద compere చేసే అమ్మాయి ఎరికా. కొంత చిలిపితనం, ఆకర్షణ ఉన్న మనిషి ఆ అమ్మాయి. నిన్న Bratislava లోనే ఉండిపోయింది. ఇక ఇంగ్లీషు దుబాసీ పేరు లోచికా.

ఇప్పుడే బస్సులో తిరిగి వస్తున్నప్పుడు చాలా విషయాలు అడిగేను. మొత్తానికి కూచిపూడి నాట్యం వాళ్లకి నచ్చడానికి కారణం దానిలో ఉన్న దృత గమనం. మణిపురి వాళ్లకి చాలా నిదానంగా boring గా ఉందిట. సరోద్ మొదట్లో చిత్రంగా ఉంది. వినగావినగా boring గా ఉందిట. ఇప్పుడు ఆరు దాటింది. 7 గంటలకి dinner. రేపు 8 లోపు బుడాపెస్ట్ ప్రయాణం.

 *1 Galanta (pronunciationHungarianGalántaGermanGallandau) is a town with about 15,000 inhabitants in the Trnava Region of Slovakia. It is situated 50 km due east of the Slovak capital Bratislava.

 The name is derived from a Slavic name Golęta (initially a collective name of a youth group selected from a kin and responsible for guarding).[4][5] A pre-Hungarian origin of the settlement is documented by the Proto-Slavic nasal "ę" conserved in the name (GalaNta; compare with Czech Holetín and Holetice).

 The area around Galanta has been inhabited almost continuously since the Neolithic. From the second half of the 10th century until 1918, it was part of the Kingdom of Hungary. The first written record of Galanta is from 1237 in a Royal Decree by Béla IV of Hungary. Through the years, the settlement was under the lordship of various noble families including the Esterházy de Galantha and the Fekete de Galantha. Beginning in 1421, the Eszterházy family ruled the town and the surrounding area. In 1613 or 1614, Galanta was promoted to a free market town. Before the establishment of independent Czechoslovakia in 1918, Galanta was part of Pozsony County. After the break-up of Austria-Hungary in 1918/1920, the town became part of the newly created Czechoslovakia. As a result of the First Vienna Award, it returned to Hungary between 1938 and 1945. On 31 March 1945, Galanta was captured by troops of the Soviet 2nd Ukrainian Front and became again part of Czechoslovakia.

Saturday, June 13, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 8

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 7

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 8

ప్రాగ్

ఈవాళ – 3-5-89    

Breakfast అయింది. మధ్యాహ్నం 11.30 కి Lunch తీసుకొని Bratislava వెళతాం. మా అందరికీ shopping కోసం 350 క్రౌనులు యిచ్చేరు మళ్లీ. వాళ్లు చెప్పినది సరిగా అర్థం చేసుకోకుండానే మాస్టరుగారు ఆజ్ఞాపించేరు – ఈ డబ్బు రేపు ఎల్లుండి భోజనం కోసం, అనవసరంగా ఖర్చుపెట్టకండిఅని. తెలియని విషయం అంత గట్టిగా నమ్మకంగా చెప్పగలగడం సాధారణ విషయం కాదు.

అనుకొన్నట్టుగా Breakfast అయిన వెంటనే Bratislava వెళ్లేం. ఈ ఊరు కూడా Prague కి తగ్గిపోయినది కాదు. యూరోప్ ఏ చిన్న గ్రామం తీసుకొన్నా అతి శుచిగా, వైభవంగా ఉంటుంది. చిన్న పల్లెటూర్లు కూడా. విశాలమైన రోడ్లతో, మంచి గృహవసతి, వినోద సౌకర్యాలతో ఉంటాయి. Bratislava డ్యాన్యూబ్*1 నది ఒడ్డున ఉంది. చిన్నప్పుడు జాగ్రఫీ పాఠాలు జ్ఞాపకం వచ్చేయి. డ్యాన్యూబ్ నదియొక్క ఘనత మాస్టారు చెప్పేవారు. అదినాలుగయిది దేశాలగుండా ప్రవహిస్తుంది. దానిమీద మధ్య స్థంభం లేని bridge

నదికి ఇవతల ఒడ్డు పాత ఊరు. నది అవతల ఆధునిక ఆకశ హర్మ్యాలు. ఈ ఊరు కొంత కాలం హంగేరీలోనే ఉండేదిట. హంగేరీ రాజు, రాణి వియన్నాలోను, బ్రాటిస్లావాలోను కూడా ఉండేవారు. రాజు, రాణుల కిరీటధారణ యిక్కడ church లోనే జరిగేదట.

మొదటి ప్రపంచ సంగ్రామంలో ఇది జకొస్లోవేకియాలో చేరిపోయింది. ఊరు మధ్య చిన్న కొండ. దాని మీద ఒక కోట. పాత రాజులు కట్టించినది.

Southeast view of Bratislava Castle

Aerial view of the complex of Bratislava Castle

Bratislava Castle and the roofs of the Old Town

In 1811, a huge fire raged through Bratislava Castle, destroying the main palace and more than 70 nearby houses

శిధిలమయిన తర్వాత ఇటీవల స్లోవేకియన్ ప్రభుత్వం పునరుద్ధరించింది. చాలా విశాలంగా ఉంది. అనేక గదులు. సంవత్సరంలో కొన్ని రోజులే తెరుస్తారట ప్రజలు చూడడానికి. ఆ కోటలో ఒక బావి*2 ఉంది. 85 మీటర్లో లోతు. అప్పటికి కాని నీరు పడలేదు. మామూలుగా అయితే నీరు కనపడదు. లోపల లైటు ఏర్పాటు చేసేరు.

జకస్లోవేకియా దేశం ఒకటే. రిపబ్లిక్కులు రెండు. జక్ రిపబ్లిక్ ప్రాగ్ ముఖ్యపట్నం. స్లొవేకియాకి Bratislava. ఈ దేశం మొదటి ప్రపంచ సంగ్రామం తర్వాత సృష్టించబడింది. హంగేరీ, జర్మనీ దేశాలలోని భాగంతో జక్కులు, స్లొవేక్కులు ఆధిక్యత గల భాగాన్ని జకొస్లోవేకియా అన్న పేరుతో మన బంగ్లాదేశ్ లా చేసేరన్నమాట. ఇక్కడ ప్రజలు అందుకే హంగేరీ, జర్మన్ భాషలు కూడా అంత ధారళంగా మాట్లాడతారు. 

మొత్తానికి Sightseeing అయేక shopping. ఈ దేశపు ప్రత్యేకమైన వస్తువు crystals. వాటితో చేయబడిన ఆభరణాలు. Cut glass సామగ్రి. ఈ వస్తువులు బాగా ఖరీదుట. చి. కమలారెడ్డి ఏదో jug లాటిది కొంది. దాని ఖరీదు 850 క్రౌనులుట. మేము కూడా ఏవో crystal దండలు కొన్నాం. ఏది కొందామన్నా వందల ఖరీదు.  

*1The Danube is Europe's second-longest river (after the Volga) and the longest in the European Union. Stretching approximately 2,850 km 1,770 miles, it flows from the Black Forest in Germany to the Black Sea in Romania. The river connects 10 nations and passes through four European capitals: Vienna, Bratislava, Budapest, and Belgrade.

Bratislava has five bridges crossing the Danube River, with the iconic Most SNP (nicknamed the UFO Bridge) standing out as its most famous landmark. The futuristic 95-meter-high viewing tower and restaurant span directly over the water, connecting the city’s historic Old Town to the large Petržalka district.   

*2The 85-meter-deep (280 ft) historic water well located in the central courtyard of Bratislava Castle, which sits majestically on a hillock overlooking the Danube River. Constructed in 1437 during the major Gothic reconstruction of the castle by King Sigismund of Luxembourg, the well is a remarkable feat of medieval engineering.  The well is 85 meters (278 feet) deep, with the water table sitting at a depth of 42 meters. Because the fortress sits roughly 80 meters above the Danube, builders had to dig deep into the hill to reach the water supply. Historical Purpose: Originally built to ensure the castle had an independent water supply during long sieges, it likely functioned alongside other rain-water reservoirs found in the fortress courtyards. Local Folklore: Local legend often associates the castle's depths with a "Well of Wishes," where visitors throw coins to make their dreams come true.