Saturday, March 28, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 2 - అమెరికా - 10

 

 Click here for - అమెరికా 9

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

అమెరికా - 10

5-4-86

కాదు. San Francisco మీదుగా వచ్చేం.  


నిన్న, అంటే 4వ తేదీని వచ్చేం. ఉదయం పోర్ట్ లేండ్ టైమ్ 8.30కి. నిన్న యిక్కడ ఒక గెస్ట్ హౌస్ లో బస. స్వయంపాకం. రాత్రి మాత్రం మాస్టరుగారి శిష్యురాలుట. ఒకరోజు ఆమె భర్తతో నాట్యం అక్కడ చేస్తుందిట. లోగడ ఏవేవో కొన్ని కూచిపూడి ఐటమ్ లు రికార్డ్ చేసుకొందిట, మద్రాసు వచ్చినప్పుడు. వారింటికి భోజనానికి తీసుకొని వెళ్లేరు, ఆమె భర్త, మరొకాయన వచ్చి. అయితే విశేషం, వారింట్లో లాల్గుడి, రమణి వాయించిన కచేరీ కాసెట్ వినిపించేరు. వంట బాగానే చేసేరు.  

ఈరోజు ఉదయం కూడా సాంబారు, పొంగలు కూడా తెచ్చేరు ఆయన. ఉదయం టిఫిన్ తరవాత యిక్కడ విన్సెంట్ అనే అమెరికన్, యిక్కడ యూనివర్సిటీ లో music శాఖ అధ్యక్షుడేమో, ఆయన ఇండోనేషియా సంగీతం గురించి అక్కడి వాద్య విశేషాలు అన్నీ చూపించి చాలా చెప్పేరు. ముఖ్యంగా గాంగులు,  వైబ్రోఫోన్ లాటి వాద్యాలు వాటిని వాయించే పద్ధతి చెప్పేరు. ఆయన music composer ట. విదేశీ సంగీతం యడల చాలా భక్తి ప్రపత్తులతో చెప్పేరు.

మధ్యాహ్నం ఇండియా ఫెస్టివల్ ఓరెగాన్ మ్యూజియం ఆఫ్ సైన్సు యిండస్ట్రీ వాళ్లు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ చూసేం. భాషావిషయకంగా ఒక కన్నడం ఆయన సంస్కృతం గురించి, మరొకాయన వెండి వస్తువులు తయారీ గురించి యిలా భారతీయ విశిష్టత తెలియజేస్తూ చాలా ఉన్నాయి. 2,3 మాసాలు ప్రదర్శనట. చాలామంది అమెరికన్ లు ఆసక్తిగా చూస్తున్నారు. మన పరిశ్రమలు, చేతిపరిశ్రమలు, మన వేదాంతం, మన ఉక్కు పరిశ్రమ, చివరకు మన అణు పరిశోధనలు గరించి కూడా తెలియజేస్తూ చాలా ప్రదర్శించేరు.

మరో సంగతి, దూరాన మంచుతో కప్పబడిన ప్రధాన పర్వతాలు* చూసేను. మౌంట్ Hood, మౌంట్ Helina. ఇది అగ్నిపర్వతం. 1980లో 400 చదరపు మైళ్ల దేశాన్ని నాశనం చేసిందిట. తరవాతది Mount Adams.


A beautifully clear day sometimes referred to as ‘5-mountain’ days - when you can see all 5 volcanoes that hang out near Portland. This is three of them this morning from Sherrard Point on Larch Mountain. From left to right: Mt. St. Helens (104 mikes away), Mt. Rainier (167 miles away), and Mt. Adams (54 miles away). You can’t see the two volcanoes behind me - Mt. Hood & Mt Jefferson.

రేపు 11 గంటలకి flight. న్యూయర్క్. 9 గంటలకి బయలుదేరుతాం.

* On clear days, Portland offers views of several major Cascade volcanoes, primarily Mount Hood (most prominent, southeast) and Mount St. Helens (north). Other visible peaks include Mount Adams (northeast), Mount Rainier (far north, visible on very clear days), and Mount Jefferson (south). These are best viewed from high points like the West HIlls or Council Crest




No comments: