Click here for - అమెరికా 4
నిన్న యిక్కడ museum మ్యూజియం చూసేం.
అక్కడ ప్లానెటోరియం కూడా
ఉంది. మేము హైదరాబాదులో చూసిన ప్లానెటోరియం కన్నా చాలా బాగుంది. చెప్పే అతను కూడా
కాస్త సరదా మనిషి. ముఖ్యంగా హేలీ
తోకచుక్క గురించి, మొత్తంమీద యింతవరకూ వచ్చిన తోకచుక్కల గురించి ఆకాశంలో ఉన్న
నక్షత్రాల గురించి చాలా ఆసక్తికరంగా చెప్పేడు.
Honolulu – Bishop Museum
Exterior of the original Bishop Museum building in Kalihi, Hawaii
బిషప్ మ్యూజియంలో
హవాయ్ దేశం గురించి అక్కడ ఏర్పడిన సంస్కృతీ వైభవాలు, ప్రాచీన కళలు అన్నీ
ప్రదర్శింపబడుతున్నాయి. ముఖ్యంగా చెట్ల బోదెలతో తయారయిన Drums చిత్రంగా ఉన్నాయి. అలాగే చెట్ల బెరడు నుంచి వచ్చిన బట్టలు చాలా బాగున్నాయి.
శాకుంతలంలో కూడా ఇటువంటి వస్త్రాలు ఉన్నట్టు శాంతారం ‘స్త్రీ’ లో చూపించేరు. 1779 లో
అనుకుంటాను, ఇటివలే ఈ ద్వీపాలు కనుగొనబడ్డాయి. 25 సంవత్సరాల వరకు ఈ ద్వీపాలు
అమెరికా రాజ్యంగా ఉండేవి. ప్రస్తుతం యివి అమెరికా రాష్ట్రంగా ఉన్నాయి. ముఖ్యంగా
యిక్కడి కొండలు, వాటి మీద ముసురుతూ ఉన్న మేఘాలు చిత్రంగా ఉన్నాయి. యిక్కడి
కొబ్బరిచెట్లు, బొప్పాయి చెట్లు విరివిగా ఉన్నాయి. ఈ హొనాలులు ప్రాక్, పశ్చిమ
ఖండాల సంస్కృతీ సమన్వయ కేంద్రంగా భావింపబడుతూంది. ఇక్కడ విశ్వవిద్యాలయంలో చాలా
తూర్పు దేశాల విద్యార్ధులకి స్కాలర్ షిప్పులు యిస్తున్నారు.
నిన్న మ్యూజియం చూసేక
ఒక జాతర చూసేం. మనవేపు తిరునాళ్లలా ఉంది. వచ్చినవాళ్లంతా ఆరుబయలులో కూర్చున్నారు.
స్వంత ఆసనాలు కొందరు తెచ్చుకొన్నారు. హవాయిన్ గిటార్లు వాయిస్తూ పాటలు ఒక ముగ్గురు
పాడేరు. రమారమి పాటలు అన్నీ ఒక్కలాగే ఉన్నాయి. అయితే సాహిత్యం మార్పు అనుకొంటాను.
భాష హవాయిన్ అయినా దానిమీద సంగీతం పాశ్చాత్యం. మన సినిమాలలో సంగీతం లాగ. దారిలో ఒక
పెద్ద గుహలోంచి వెళ్లేం. సిమెంటు, ఉక్కు కట్టడాల మధ్య జీవించిన పాశ్చాత్య ప్రజకి
ఇక్కడి ప్రకృతి ఇక్కడి వెచ్చని వాతావరణం ఎక్కువ ఆకర్షిస్తుంది. మళ్లీ కావలసిన
పాశ్చాత్య జీవన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. హొనాలులు కూడా అన్ని అమెరికా పట్టణాలలాగే
పెద్ద పెద్ద భవనాలతోనే ఉంది.
ఈరోజు సాయంత్రం మా
నాట్య కార్యక్రమమం ఉంది. ఇక్కడనుండి Portland వెళ్లాలి.
.jpg)

