Click here for - అమెరికా 3
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను.
- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి
అమెరికా - 4
21-3-86
నిన్న రాత్రి, అంటే 21, మార్చ్, ఇక్కడ కార్యక్రమం బాగా అయింది. Duango చిన్న ఊరు. 30 వేలు జనాభా. మనం సాలూరు నుంచి
కోరాపుట్టి జయపురం బస్సు మీద ఘాటీ రోడ్డు మీద వెళుతున్నట్టుగా ఉంది ప్రదేశం. అయితే
విపరీతంగా చలి. ఇక్కడి పరిస్థితి
మిగిలిన అమెరికా అంత ధనవంతంగా లేదు. ఇక్కడి జీవనసరళి కూడా మరీ వైభవోపేతంగా లేదు.
ఇప్పుడు మళ్లీ Denver వెళ్ళాలి. అక్కడ అనుకోకుండా ప్రోగ్రాం
నిర్ణయం అయింది. తరవాత సాండియాగో వెళతాం. ఇప్పుడు ఇక్కడ Time 9.20.
29-03-86
San
Diego (California) వెళ్లేం. Denver (Colorado) కి San Diego (California) కి 1 గంట time వ్యత్యాసం.
San
Diego లో విపరీతమైన చలి బట్టల
అవసరం లేదు. అయినా సుఖమైన చలి ఉంది. ఎవరో కన్నడం ఆయన మమ్మల్ని receive చేసుకొన్నారు. రాగనే
భోజనం. తర్వాత రాత్రికి మరోచోట భోజనానికి ఆహ్వానం. శ్రీ తిరుమలేశ ఆయన పేరు. తరవాత
తెలిసిన సంగతి, ఆయన భార్య శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రిగారి కూతురు. వారికి కొడుకులు,
కూతుళ్లు, మనవలు ఉన్నారు. శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రిగారి పద్యాలు చాలా జ్ఞాపకం
ఉన్నాయి. గడచిన ఆ రోజులు, ఆ పాత కబుర్లు కాస్త వాళ్లకీ సంతోషాన్ని కలిగించి
ఉండాలి. వాళ్లంతా క్రిష్ణ భక్తులు. వాళ్ల పెద్ద అబ్బాయి డోలు వాయిస్తుంటే బృందగానం
హరే రామ హరే క్రిష్ణ భజన జరుగుతుంది. ఒక ఊపిరిలేని సింగిల్ రీడ్ హోర్మోనియం ఉంది
వాళ్లింట్లో. దానితో నా కాలక్షేపం జరిగింది. నేనూ పాడేను. కనకదుర్గ కొంతసేపు
పాడింది.
San
Diego లో Travel Lodge లో ఉన్నాం. నా roommate సన్యాసిరావుగారు. మూడు రోజులు ఉన్నాం సాండియాగోలో. నిన్న, అంటే 28 తేదీ ఇక్కడ
ఆరు గంటలకి హవాయ్ ద్వీపాల ముఖ్యపట్నం హోనలూలూ వచ్చేం.
సాండియాగో టైముకి మరో రెండు గంటలు వెనక యిక్కడ. హోనలూలూ సంబంధించి సోమర్సెట్
మాం రాసినది ఏదో కథ చదివిన జ్ఞాపకం. పట్నం అన్ని అమెరికా పట్నాల్లాగే వైభవంగా ఉంది. ఇక్కడ
భారతీయులు మాకు నిన్న రాత్రి భోజనం ఏర్పాటు చేసేరు. హిందీవాళ్లు, కన్నడంవాళ్లు,
తెలుగువాళ్ళు కూడా ఉన్నారు. మార్తా ఏస్టిన్ కి సహచరిగా ఒకావిడ... కాదు... ఒక
అమ్మాయి... కాదు... వయస్సు నిర్ణయించలేను, వచ్చింది. రాయడం మరిచిపోయిన సంగతి ... సాండియాగోలో
చక్కటి zoo ఉంది. మాస్టారుగారూ, నేనూ, మార్తా, ఆవిడ సహాకురాలు
వెళ్లేం. రాత్రి దాకా అక్కడ గడిపేము. మళ్లా రాత్రి కన్నడం ఆయన యింట్లో భోజనం
చేసేం. కాస్త మధుసేవనం చేసి పైన రాసింది సాండియాగోలో జరిగినది మరిచిపోవడంచేత
రాసేను.
Entrance to the zoo
with sculpture Rex's Roar, after the lion that inspired the zoo
First official seal
of the Zoological Society of San Diego
Mandrill, world's
largest species of monkey, at the zoo
మళ్లీ హోనాలూల సంగతి. ఇక్కడ చక్కటి హోటేలులో ఉన్నాం. దాని పేరు పగోడా హోటేలు.
ఊరు మధ్యగా ఉన్నాం. బహుశః యిప్పుడు షాపింగ్ కి వెళతామేమో!
No comments:
Post a Comment