Click here for - అమెరికా 11
మర్నాడు ఉదయం లండన్ airport లో దిగేం. అక్కడ
ఒక గంట తర్వాత విమానం బయలుదేరుతుంది. లండన్ airport మాకు బాగా పరిచయమే. నేను యింకా మగవాళ్లు ఉపయోగించే perfumes కొందామనుకొన్నాను. చాలా ఖరీదుగా ఉండడంచేత కొనలేదు. Fight లో Dunhill సిగరెట్లు
మాత్రం కొన్నాను ఎవరికైనా యివ్వడానికి.
మనస్సులో ఆరాటం. మేము కొన్న వస్తువుల మీద duty ఎంత వేస్తాడో
అని. అదృష్టం, ఏ బాధాలేకుండా బయటపడ్డాం.
ఢిల్లీ 8 తేదీ రాత్రి 11 గంటలకి చేరుకొన్నాం. మమ్మల్ని receive చేసుకొందికి ICCR ఉద్యోగి ఎవరూ
రాలేదు. ఆఖరు సామానంతా ఒక van లోకి
ఎక్కించిన తర్వాత ఆయన వచ్చేడు. సవ్యంగా మళ్లా అశోక యాత్రి నివాస్ చేరుకొన్నాం. 9
తారీఖు అంతా ఢిల్లీలో గడిచింది.
9-4-86
9 తేదీ ఏప్రిల్, ఢిల్లీలో చాలా వేడిగా ఉంది. అశోకా యాత్రి నివాస్ కి దగ్గరగా
ఒక South Indian భౌజన ఫలహారాలు దొరికే ఒక హోటేలు ఉంది. చుట్టూ పక్కల పనిచేసే
దక్షిణాది ఉద్యోగులు అక్కడే ఆకలి తీర్చుకొంటారు. పదార్ధాలు రుచిగా, శుచిగా ఉంటాయి
నిరాడంబరంగా. ఏది తీసుకొన్నా 1.50. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం అక్కడే. అయితే
యింకా తినలానే అనిపిస్తుంది. రాత్రి 7.30కి ఆ హోటేలు మూసేస్తారు. ఆ సంగతి జ్ఞపకం
లేక 8 గంటలకి బయలుదేరి తిండికోసం తిరిగి తిరిగి చివరకి కన్నాట్ ప్లేస్ లో ఒక
సామాన్య హోటేలులో ఆకలి తీర్చుకొన్నాం. అయితే వాడు యిచ్చిన అన్నం, పెరుగు, రొట్టి,
వాటి ఆధరవులకి నలుగురికి 65 రూపాయాలు యిచ్చేం. ఢిల్లీలో మా అఫిషియల్ passports తిరిగి యివ్వడం అయింది. మొదట మా దస్తుల విషయంలో యివ్వవలసిన
500 రూపాయలు చెక్కు రూపంగా యిచ్చేరు.
10-4-86
మర్నాడు 10 తేదీ ఉదయం 6 గంటలకి flight. మేము 3 గంటలకి నిద్రలేచి బయలుదేరేం. యాత్రీ నివాస్ లో మేము 18 అంతస్థులో
ఉన్నాం. అక్కడ lift ఒకంతట రాదు.
అందుకు. Flight లో మళ్లా నా వీణ పెట్టుకోడానికి ఏం చిక్కో అని ఆరాటం.
అదృష్టం, నా పక్క సీటు ఖాళీగా ఉంది. Airhostess చాలా గౌరంగా ఆ సీటులో నా వీణ పెట్టుకోమంది. ఎంత మనశ్శాంతి. హైదరాబాదులో ఒక అరగంట
విమానం ఆగుతుంది. శ్రీ శంకరరెడ్డిగారు వస్తారని, డాలర్లు అక్కడే యివ్వాలని అన్నారు
మస్టారుగారు. కాని ఆయన రాలేదు. అంతేకాదు, విమానంలోవారు బయటకి, బయటవారు transit లోకలియడానికి వీలులేదన్నారు. ఆ రోజు Indian Airlines వారు యిచ్చిన ఫలహారం, పానీయాలు చాలా సంతృప్తిగాను, సుఖంగాను
ఉన్నాయి. అనుకొన్న సమయానికి మద్రాసు చేరుకొన్నాం. Airport కి కూచిపూడి ఆర్ట్ ఎకాడమి మిత్రులు వచ్చేరు. చక్కటి
ఏర్పాట్లు చేసేరు. సుఖంగా యిళ్లకి చేరేం.
.jpg)
No comments:
Post a Comment