Saturday, March 14, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 2 - అమెరికా - 8

 

 Click here for - అమెరికా 7

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

అమెరికా - 8

2-4-86

మాస్టరుగారికి ఈరోజు పుట్టినరోజుట. చాలా ప్రసన్నంగా, సంతోషంగా ఉన్నారు ఆయన.

నిన్నటి సంగతి ఈవాళ రాస్తున్నాను. నిన్న మళ్లా ద్వీపానికి మరో పక్కకి van మీద వెళ్లేం. అక్కడ సముద్రం ఒడ్డున చిత్రమయిన ప్రదర్శనలు ముఖ్యంగా సముద్ర జీవితానికి సంబంధించినవి – Sea Parks, సముద్రపు జీవులు – Sea Lions అన్నారు. ఇంకా Dolphins ట. అన్నీ ఒకలాగే అనిపించాయి నాకు. అయితే ఆ జంతువుల చేత సర్కసులా ప్రదర్శించేరు. కోతులు, గంగిరెద్దులు మనవాళ్లు ఆడించినట్టు ఆ చేపలచేత ఆడించేరు. అయితే ఈ జంతువు ఆటలు చూసేవారు నాగరికులు. ఆడించే విధంగా నాజూకు. అతి stylish. ఆ చేపలు మనుషుల కంటే కూడా పెద్దవి. వీళ్ల సూచనలను బట్టి అవి రకరకాలుగా ఆడేయి. మొత్తానికి చాలా సంతోషంగా గడిచింది. 

నిన్న యింటికి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి 7 గంటలకి ఒక నాట్యం క్లాసు చూసేం. హవాయిన్ డాన్స్ క్లాసు. ఆడామగా చాలామంది ఉన్నారు శిష్యులు. డాన్సుకి అనుకూలమయిన తెల్లని దుస్తులు వేసుకొంటారు. ఈ డాన్సు పేరు హులా*. న్యాయంగా ఆహర్యంగా ఆకులు, రెమ్మలు, పువ్వులే దుస్తులుగా ధరించాలిట. ఎక్కువ వాద్యాలు లేవు. ఒక ఆనపకాయ తుంబ. దానినే తాళవాద్యంగా ఉపయోగిస్తారు. ఒక చండ లాటి చర్మవాద్యం కూడా ఉంది. ఆ నాట్యం కూడా సంవత్సరాల తరబడి శ్రద్ధగా నేర్చుకుంటారుట.

 


 

ముఖ్యంగా సంగీతం అంతా మూడు స్వరాలుతోనే నడుస్తుంది. కానీ మన భారతీయ నాట్యంలాగే ముద్రలు ఉపయోగిస్తారు. ఏవిధమైన కళాపరమైన పాండిత్య ప్రకర్ష ఉండదు. చాలా ప్రశాంతత ఉంది. ఆ నాట్య తాళగతులులో క్లిష్టత ఉండదు. కానీ దానిలో మనం ఆనందించడానికి కొంత అలవాటుపడాలి.

మరో చిత్రమమయిన అలవాటు. హవాయిన్లు అందరూ కలుసుకోగానే ముద్దు పెట్టుకొంటారు. చిన్నా పెద్ద అంతా.

నిన్న మాస్టారుగారికి చాలా దండలు వేసేరు. ఆయన మాకు అందరికీ దండలు తిరిగి వేసేరు. జ్ఞాపకచిహ్నంగా ఆ దండని ఎండలో పెట్టి నిలవ చేద్దామనుకొంటున్నాను. ఇక్కడ దండలు వేస్తే మన దేశంలోలా వెంటనే తీసివేయరు ఏదో పురుగు పడ్డట్టు. హవాయ్ లో దండలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ దేశంలో అడుగుపెట్టగానే అందరూ దండలు వేసుకోడమే మొదట. 

అందరూ ఇంగ్లీషు మాట్లాడతారు.

ఈవాళ, అంటే 2వ తేదీ అన్నమాట, మార్తా, ఆమె సహచరి సముద్ర స్నానాలకి వెళ్లేరు. మేము ఇక్కడ ఉన్న షాపులలో తిరగడానికి వెళ్లి వచ్చేం కొన్ని గంటలు. రేపు రాత్రి Portland వెళతామట.     


*Hula

Hula in Honolulu is a vital cultural practice, blending traditional (kahiko) and modern ('auana) styles to share Hawaiian stories, history, and genealogy. Key experiences include free nightly shows at Kuhio Beach (Tues/Sat), daily performances at Ala Moana Center, the new Kilohana Hula Show at the Waikiki Shell, and immersive lūʻau. YouTube +7 

https://youtu.be/UpzXrAYpUhA?si=QFoy8jtYfuUxQzy9

Hula in Honolulu features a mix of traditional percussive instruments for kahiko (ancient) dance and Western-influenced instruments for 'auana (modern) dance. Core instruments include the ipu (gourd drum), pahu (sharkskin drum), 'ulī'ulī (feathered rattles), pū'ili (bamboo sticks), kāla'au (rhythm sticks), and ukuleleWikipedia +4

This video demonstrates how to play the 'ulī'ulī, a feathered gourd rattle used in both modern and ancient hula: 

https://youtu.be/St8aQTimf20?si=4U4FWMUJtJyssPLk

 

 



No comments: