Click here for - రష్యా 18 - 26-10-1987
3-3-86
మద్రాసు నుంచి ఢిల్లీ ప్రయాణం. ఇంటి నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపుగా బయలుదేరేను. Airport కి ఆత్మీయులందరూ
వచ్చేరు. చి. అల్లుడు రామచంద్రరావు ఎంతో ఉత్సాహంగా అందరికీ ఫోటోలు తీసేరు. చి.సౌ. చిన్నమ్మడు చి. పిల్లలతోనూ వచ్చింది. ఈ
అనుభవాలు మరో పాతిక సంవత్సరాలు ముందుగా పొంది ఉంటే యింకా బాగుండేది కదూ. చి.సౌ. రమణమ్మ తల్లి, చి. బాలమ్మ చి. గోపి అందరూ ఉత్సాహంగా మాకు
వీడ్కోలు యిచ్చేరు. ఈసారి ఫోటోలు తీసేవాళ్లు ఎవరూ లేరు. చి. రామచంద్రరావు తీసిన ఫోటోలే
యీనాటి వీడ్కోలు చిహ్నాలు.
రాత్రి 8.30 గంటలకి ఢిల్లీ చేరేం. ICCR కి సంబంధించిన ఉద్యోగి మమ్మల్ని అశోక్ యాత్రిక్ నివాస్ కి తీసుకొని వెళ్ళేరు.
ఇది ప్రఖ్యాత అశోక్ హోటేలు కాదు. 20 అంతస్థుల భవనం. ప్రభుత్వానికి
సంబంధించినదనుకొంటాను. అక్కడ మాకు దినభత్యం క్రింద 100 రూపాయలు యిచ్చేరు. డ్రస్
కోసం యిస్తారనుకొన్న 500 యివ్వలేదు. దానికి దరఖాస్తు పెట్టడం అయింది. తిరుగుదలలో
యిస్తారనుకొంటాను. ఢిల్లీలో అంత చలి అనిపించలేదు. చలి లేకపోలేదు. మర్నాటి ఉదయం
కింద ఉన్న కాంటీనులో కాపీ, ఫలహారం అయింది. కాఫీ 2 రూపాయలు. Bread Toast 4 రూపాయలు. ఇడ్లీలు
రెండు 6 రూపాయలు. ఏమీ బాగులేదు. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేయాలి కాబోలని
భయపడ్డాం కానీ రెండు మైళ్లు నడిచి మద్రాసు హోటేలులో కన్నాట్ place లో భోజనం చేసేం. భోజనం 10
రూపాయలు. మనం తినలేనంత. రుచిగానూ పెట్టేడు. భోజనం మద్రాసు భోజనం. రెండుసార్లు జరదా
వేసుకొన్నాను. పాన్ పరాగ్ జరదా జబ్బాలు కొనాలని అనుకొన్నాను. అవలేదు. రాత్రి వేగం
నిద్రపోయేం.
ఒంటి గంట రాత్రికే బయలుదేరేం. వీణ మాతో తీసుకొనివెళ్లడం ఎలాగన్నది
తేలిపోయింది. నాతోనే తీసుకొని వెళ్లడానికి, యితర ప్రయాణికులకు యిబ్బంది లేకుండా
తీసుకొని వెళ్లడానికి ICCR వాళ్ల అనుమతి పత్రం వచ్చింది.
తెల్లవారుఝామున 4 గంటలకి వెళ్లే flight ఉదయం 8 గంటలకి బయలుదేరింది. చాలా చికాకు అయిపోయింది. దుబాయ్ మీదుగా వెళ్లేం. దుబాయ్
airport లో అన్నీ చవక అన్నారు. అయితే నా దగ్గర ఉన్నవి 8 డాలర్లే. అంటే ముందురోజు
యిచ్చిన 100 రూపాయలు నా దగ్గర ఉన్న 25 రూపాయలు, కర్చులు పోగా airportలో మార్చిన (ఉన్న రూపాయలతో)
8 డాలర్లే ఉన్నాయి. అందుచేత ఏమీ కొనే సాహసం లేదు. బద్ధిగా తిరిగి వచ్చేసాం. వెంపటి
చిన సత్యంగారు, MS రావుగారూ 7 డాలర్లకి ఏదో perfume కొన్నారు. లండన్ airport లో దిగేం. ఇంతకు పూర్వం తెలిసి
ఉన్నదే అవడం చేత అంతా మాములుగానే ఉంది. అందుచేత rest rooms ఎక్కడ ఉన్నదీ
తెలియడం చేత ధైర్యంగా toilet కి వెళ్లివచ్చేం అన్నమాట.
మద్రాసు నుంచి ఢిల్లీ ప్రయాణంలోనూ ఢిల్లీ నుంచి Newyork ప్రయాణంలోనూ కూడా Air India flight లో భోజనం బాగుంది. ఆరోగ్యం సక్రమంగానే ఉంది. 5 రాత్రికి న్యూయార్క్
చేరుకొన్నాం. అక్కడ మార్తా Austin airport కి వచ్చి సమర్థంగా నిర్వహించి Hotel
Esplanade లోదించింది. MS రావుగారు, నేను
ఒక గది. బయట విపరీతమైన చలి. గదిలో భరించలేని
వేడి. అయితే వెంటిలేటరు తీస్తే మళ్లీ చల్లగా అయింది.
మర్నాడు ఉదయం ఫారిన్
హీట్ 34 డిగ్రీలు ఉంది. న్యూయార్క్ లో మధ్యాహ్నం భోజనం మద్రాసు పాలెస్ లో. అక్కడ
సాంబారు భోజనం దొరికింది. ఆ పక్కనే చాలా Indian
Hotels ఉన్నాయి. అన్నపూర్ణా అన్నది Madras Palace పక్కనే ఉన్న మరో
హొటెలు. గదికి చేరుకొన్నాం. అంతకంటే చేయడానికేముందీ.
మర్నాడు ఉదయం, అంటే ఆరవ తేదీ అట్లాంటా మీదుగా
టలహస్సీ వెళ్లేం. ఈ ప్రయాణంలో నా వీణ కోసం ప్రత్యేకించి టిక్కెట్టు తీసుకొనేది
మార్తా. నన్ను చాలా ఆప్యాయంగా సంగీతా అని పిలస్తోంది. ఆ పిలుపు కొంచెం ఎబ్బేట్టుగా
అనిపించేది. మార్తా ఇంగ్లీషు నాకు సుబోధకంగానే ఉంది. ఇంగ్లీషులో కాలక్షేపం
చేస్తున్నాను. అట్లాంటా నుంచి టలహస్సీ వెళ్లే flight
మళ్లా late. Tallahassee అంటే Florida ముఖ్యపట్నం. జనం
మాత్రం 1.5 లక్షలు ఉంటుందిట. ఇక్కడ చెట్లు కొంచెం కొంచెం
చిగురిస్తున్నాయి.
Tallahassee
లో ఒక motel
లో ఉన్నాం. రాయడం మరిచేను. న్యూయార్క్ లో 6 రాత్రి
మా కార్యక్రమం అయింది. ఏషియన్ సొసైటీలో. సంయుక్తా పాణిగ్రాహి ప్రోగ్రాం కూడా మా
కార్యక్రమంతో పాటే అయింది. మొదట ఒక గంట మాది. తరవాత మరో గంట వాళ్లది. మరో గంట
దగ్గరగా తరవాత మళ్లా సంయుక్తా పాణిగ్రాహి ది. శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారి
నాట్యం మరీ ఎబ్బేట్టుగా వాళ్లు తీసుకోలేదు. మగవాడు ఆడవేషం వేసి నాట్యం చేయడం కొంత
సహజంగానే తీసుకొన్నారు.
మళ్లా టలహస్సీకి వద్దాం.
.jpg)
No comments:
Post a Comment