Saturday, June 20, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 9

 


Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 8

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 9

ప్రాగ్

4-5-89

ఈరోజు breakfast తర్వాత మరో చిన్న ఊర్లో మాకచేరీ. మధ్యాహ్నం 1-30కి. తర్వాత తిరిగిరావడం. రేపు ఉదయం బుడాపెస్ట్ వెళతాం. ఇక్కడికి నాలుగు గంటల బస్సు ప్రయాణం. మన బస్సులు కావు. మా పార్టీకి మాత్రం ఒక బస్సు. లోగడ అనుకున్నాను, నేనే కాదు బట్టాచార్య అన్నమాట కూడ అదే. ఏమిటీ? ఖర్చు తక్కువ కోసం మమ్మల్ని Bratislava బయట ఈ చిన్న ఊళ్లో పెట్టేరు. ఇప్పుడు అలా అనిపించలేదు. మా కార్యక్రమాలు ఉన్నఊళ్లు Nove Zamky కి చుట్టు పక్కలనే ఉన్నాయి. డబ్బు ఖర్చు పెట్టుకొందికి కావలసిన సౌకర్యాలూ ఉన్నాయి ఇక్కడ కూడా.

ఉదయం breakfast తీసుకొని వెళ్లిన ఊరు పేరు గలంటా. సరోద్ కచేరీ. రెండవది మాది.


శరన్ రాణి – సరోద్ కళాకారిణి

అన్ని స్థలాల్లోలాగే యిక్కడ కూడా మాకే మంచి మార్కులు.

ఈ గలంటా*1 అనే ఊరు district townమొన్న అంటే 1వ తేదీని వెళ్లిన షెల్లా, ఇవన్నీ దగ్గర దగ్గరగా పాతిక ముప్ఫై మైళ్ల దూరంలోనే ఉన్నాయి.


Galanta - Cityscape

 షెల్లా అనే ఊరు దగ్గర ఒక నది ఉంది. దాని పేరు వాహ్’.

 

 

River Vah – Sala

మాతో వచ్చిన ముగ్గురు మహిళల పేర్లు – ఒకామె మార్తా. ఈవిడే ఏజన్సీ ఆఫ్ Arts లో ఉద్యోగిని. స్టేజీ మీద compere చేసే అమ్మాయి ఎరికా. కొంత చిలిపితనం, ఆకర్షణ ఉన్న మనిషి ఆ అమ్మాయి. నిన్న Bratislava లోనే ఉండిపోయింది. ఇక ఇంగ్లీషు దుబాసీ పేరు లోచికా.

 

ఇప్పుడే బస్సులో తిరిగి వస్తున్నప్పుడు చాలా విషయాలు అడిగేను. మొత్తానికి కూచిపూడి నాట్యం వాళ్లకి నచ్చడానికి కారణం దానిలో ఉన్న దృత గమనం. మణిపురి వాళ్లకి చాలా నిదానంగా boring గా ఉందిట. సరోద్ మొదట్లో చిత్రంగా ఉంది. వినగావినగా boring గా ఉందిట. ఇప్పుడు ఆరు దాటింది. 7 గంటలకి dinner. రేపు 8 లోపు బుడాపెస్ట్ ప్రయాణం.

  

 *1 Galanta (pronunciationHungarianGalántaGermanGallandau) is a town with about 15,000 inhabitants in the Trnava Region of Slovakia. It is situated 50 km due east of the Slovak capital Bratislava.

 The name is derived from a Slavic name Golęta (initially a collective name of a youth group selected from a kin and responsible for guarding).[4][5] A pre-Hungarian origin of the settlement is documented by the Proto-Slavic nasal "ę" conserved in the name (GalaNta; compare with Czech Holetín and Holetice).

 The area around Galanta has been inhabited almost continuously since the Neolithic. From the second half of the 10th century until 1918, it was part of the Kingdom of Hungary. The first written record of Galanta is from 1237 in a Royal Decree by Béla IV of Hungary. Through the years, the settlement was under the lordship of various noble families including the Esterházy de Galantha and the Fekete de Galantha. Beginning in 1421, the Eszterházy family ruled the town and the surrounding area. In 1613 or 1614, Galanta was promoted to a free market town. Before the establishment of independent Czechoslovakia in 1918, Galanta was part of Pozsony County. After the break-up of Austria-Hungary in 1918/1920, the town became part of the newly created Czechoslovakia. As a result of the First Vienna Award, it returned to Hungary between 1938 and 1945. On 31 March 1945, Galanta was captured by troops of the Soviet 2nd Ukrainian Front and became again part of Czechoslovakia.

    

No comments: