Saturday, February 28, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 2 - అమెరికా - 6

 

 Click here for - అమెరికా 5

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

అమెరికా - 6

31-3-86

హవాయ్ ద్వీపాలు మొత్తం 8. ఈ ద్వీపాల ముఖ్యపట్నం హొనాలులు*. ఈ పట్నం O’ahuఒ ఆహు – ద్వీపంలో ఉంది. నూటికి ఎనభై మంది ఈ ద్వీపంలోనే ఉన్నారట. ఈరోజు మార్తా ఒక van తీసుకొని తానే drive చేసి మాకు ఈ ద్వీపం అంత చూపించింది. ద్వీపం అంటే సిందుబాదు బాధలు పడిన ద్వీపంలాటిది కాదు. చాలా పెద్దదే. అంటే 60 మైళ్లు ప్రయాణం చేసేం. అక్కడ ఒక లోయ ఉంది. ఏదో పేరుంది. మన నీలగిరిలా అనిపించింది. 

 

MANAO WATTERFALLS - HONOLULU, HAWAII




అక్కడి చక్కటి జలపాతాలు* అనేక రకాల ఫలవృక్షాలు, పక్షులు, ఇలాంటివి చూసినప్పుడు ఇంతే కదా అనిపిస్తాయి. వింత అనిపించదు. కానీ ఈ ద్వీపాలు మన ఊహల్లో కూడా గతంలో లేనివి. ఈనాడు ఇక్కడకి చేరేం. ఏ అజ్ఞాత పూర్వబంధమో! వీటి పుట్టుపూర్వోత్తరాలు, వీటికి మనకి గల దూరం, చుట్టూ ఈ సముద్రమూ. ఈ చిన్న ద్వీపాలలో కూడ ఒక ప్రత్యేక నాగరికత, భాష, కళలు, వాటికీ మనకీ గల పోలికలు చూస్తుంటే ... మాననత్వం అంతా ఒకటే. దానిలో మళ్లా ప్రత్యేక ఆకర్షణ పొందుతాం.

ఇవాళ అక్కడ హవాయిన్ వాళ్లు ముగ్గురు పిల్లలు డాన్సు చేసేరు. ఒక పెద్దావిడ మన ఆనప తుంబలాంటి దానితో తాళవాద్య సహకారం. ఆ ఆట, ఆ పాట వింటుంటే అంతా మనకి తెలిసిందే అనిపిస్తూ మనకేమీ సంబంధం లేదనిపిస్తుంది. అది మన బుద్దికి కాదు, మన హృదయానికి సానుభూతి కలిగిస్తుంది. అటువంటి కళ అది.

ఆ ప్రదేశంలోనే మేము పట్టుకొని వెళ్లిన పదార్థాలు తిన్నాం.

అందరూ, అమెరికనులు, జపానువాళ్లు, చైనావాళ్లు, స్వదేశీయులు హవాయిన్లు, గిటారు వాయిస్తూనే పాడతారు. అక్కడ ఒకటే హోటేలు ఉంది. చిన్నది. వేడి, చలవ పానీయాలు, పిజ్జాలు, అన్నీ దొరుకుతాయి. ఒకరిద్దరు యువకులు గిటారు వాయిస్తూ పాడేరు. అక్కడి receptionist చటుక్కున లేచి డాన్సు ప్రారంభించింది. అందరికీ ఆటపాటలు జీవతంలో ప్రధా భాగంగా ఉన్నాయి. ఎవరి స్వేచ్ఛ వాళ్లది. ఆహారం విషయాల్లో. వస్త్రధారణలో ఏ విధమైన పట్టింపు లేదు. అయితే ఆ వస్త్రధారణ కొంతమందికి ఎంతో అందంగా ఉంది. మాట వరసకి బికినీ వేసుకొన్న కొంతమందికి అందంగా లేదు. అయినా వాళ్లిష్టం వాళ్లది.

ఈ రాత్రి ఎవరో భోజనానికి పిలిచేరు. టైమయింది.

*Honolulu, capital and principal port of Hawaii, U.S., seat of Honolulu county. A modern city, it extends about 10 miles (16 km) along the southeastern shore of Oahu Island and 4 miles (6 km) inland across a plain into the foothills of the Koolau Range. It is the crossroads of trans-Pacific shipping and air routes, the focus of interisland services, and the commercial and industrial centre of the state. The city-county (area 597 square miles [1,545 square km]) comprises all of Oahu and some outlying islets, which have an area aggregate of only 3 square miles (8 square km) but extend for more than 1,300 miles (2,100 km) and constitute the Hawaiian and Pacific Islands National Wildlife Refuge. It is administered as a single entity and has about 80 percent of the state’s population.

Hawaiian legend indicates a settlement at Honolulu (meaning “protected bay”) in 1100. Overlooked by Captain James Cook and other early explorers, the harbour with its outlet through the reef of Nuuanu Stream and sheltered by Sand Island was entered by Captain William Brown in 1794. After 1820 Honolulu assumed first importance in the islands and flourished as a base for sandalwood traders and whalers. A Russian group arrived there in 1816, and the port was later occupied by the British (1843) and the French (1849) but was returned to King Kamehameha III, who on August 31, 1850, officially declared Honolulu a city and the capital of his kingdom (Honolulu had been the de facto capital since 1845). In December 1941 the city and the adjacent Pearl Harbor naval-military complex came under Japanese aerial attack. Honolulu became a prime staging area for the remainder of World War II, a position it retained during the Korean War and until the end of the Indochina (Vietnam) conflict in 1973. Military expenditure remains an important source of income.

The port serves numerous manufacturing plants in the city-county, including pineapple canneries, sugar refineries, clothing factories, and steel, aluminum, oil, cement, and dairying enterprises. The international airport is one of the busiest in the United States, with nearby Waikiki—which has a beach lined with luxury hotels and contains an aquarium, zoo, and the lively International Market Place for Pacific baisn crafts – as the primary destination of tourists.

Inc. city, 1909. Pop. (2010) 337,256; Honolulu Metro Area, 953,207; (2020) 350,964; Urban Honolulu Metro Area, 1,016,508.

Manoa Falls is a popular, scenic 150-foot waterfall in Honolulu's Manoa Valley, easily accessed via a 1.6-mile (2.6 km) round-trip trail through alush rainforest. Located only 15 minutes from Waikiki, it is a top attraction for hikers of all skill levels. Due to high rainfall, the trail is often muddy and slippery, so sturdy footwear is recommended.

No comments: