Saturday, November 8, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 9 - 03-10-1987

 

 

Click here for - రష్యా 8 - 01-10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 9

3-10-87     

ఉదయం Frunzeకి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉన్న excursion spotకి తీసుకొని వెళ్లేరు. వాటిని అలర్చా* - పర్వతాలు అంటారు. అటువంటి స్థలాలు మనకి కొత్త కాకపోయినా బాగుంది అక్కడ. మన నీలగిరి కొండలలో ఉన్నట్టు ఉంది. ఆ కొండలలో పుట్టి, మంచు కరిగి ఆ నీటితో ఏర్పడ్డ సెలయేరు దానిమీద చిన్న వంతెన. చుట్టూ ఎత్తైన కొండలు వాటి మధ్యనుంచి రోడ్డు, చక్కటి చలి. ఆ చలికి సరిపడ్డ చక్కటి ఎండ. బాగుంది. 

అక్కడ కొన్నిగుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాల యజమాని యిల్లు అక్కడే అనుకొంటాను. గుర్రాలు దృఢంగా ఉన్నాయి.

అక్కడయింకా కొండలలోకి పోదలచుకొన్నవాళ్లు ఆ గుర్రాల మీద తిరి రావచ్చును. గంటకి ఒక రూబుల్ 80 కోపెక్కులు యివ్వాలి. సరే.  నడవడమే గొప్ప అనుకొన్నవాళ్లం గుర్రమెక్కడం కూడానా! సరే.  వ్లాడిమరు, నీనా, లైలా, రీనా ఎక్కేరు గుర్రం. సరీ, రత్తయ్యగారికి ఎప్పటినుంచోఉన్న తీరని కోరికట, ఆయన, సరే, రామూ. అంతే అనుకొంటాను. రత్తయ్యగారి గుర్రం నడమవడం మాని గడ్డిమేయడం ప్రారంభించింది. దాన్ని ఎలాగ నడిపించాలో ఈయనకి తెలియదు. కొడితే కిందకి ఎత్తేస్తుందేమిటో? మర్యాద తెలియని జంతువు కదా! ఆఖరికి ఆ అనుభవాన్ని శాశ్వతం చేసేరు రత్తయ్యగారు. ఎలా? ఆ గుర్రంమీద స్వారీ చేస్తూ ఫోటో తీయించుకొని.

రాత్రి చండాలిక అయింది. మంచి రక్తి కట్టింది. ఇంతవరకు ఇంత మంచి థియేటరు చూడలేదు. ప్రేక్షకులు కూర్చున్న హాలుకంటే స్టేజీయే పెద్దది. దానిలో పెద్ద ఆర్కెస్ట్రా కూర్చుందుకి, వందల డాన్సర్సు డాన్సు చేయడానికి తగినంత స్టేజీ. అద్భుతమయిన లైటింగ్ ఏర్పాట్లు. చక్కటి తెరలు. మేము చండాలికకి ఉపయోగించుకొన్న stage** ఉన్నదానిలో నాలుగో వంతు ఉంటుంది.

04-10-87

ఉదయాన్ని రోజుూ వచ్చేఎండ రాలేదు.  Breakfast తర్వాత ఏదో మ్యూజియం, Zooకి వెళ్లేం. మ్యూజియం కిర్గీజియా  Republicకి సంబంధించి. ఇక్కడ పంట, వ్యవసాయం, పరిశ్రమలు, ఇక్కడి చేతిపనులు, ఊలు పరిశ్రమ. ఇక్కడి భాష, పత్రికలు, సాహిత్యం మొదలైన వాటి గురించి. ఇది రష్యన్ రివల్యూషన్ తరవాత అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడి దినపత్రికలు అవి కూడా 1943 తరవాతే. అసలు ఈ ఊరు పుట్టి 109 ఏళ్ళు అయిందట. 109వ నగర జన్మదినోత్సవం జరుపుకున్నారు మొన్ననే. మరో సంగతి యిక్కడే కాదు అంతటా ట్రాం కార్లలా, ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఆ మ్యూజియం, Zoo చూసేం. మహా చలి. నేను శాలువా తీసుకోలేదు. లోపలి స్వెట్టరు వేసుకోలేదు. అనవసరం అనుకొని. దాని అవసరం అయింది. రామరామ, రాము తన శాలువ యిచ్చి ఆదుకొన్నాడు సమయానికి.

అక్కడనుంచి ఒంటిగంటకి ఒక రష్యన్ concertకి వెళ్లేం.  కళాకారులు మాస్కో నుంచి వచ్చేరు. ఎలక్ట్రిక్ గిటార్లు,  drums ప్రధానం, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న pop music మంచి timing మంచి హుషారుగా జరిగింది. వాళ్లలో ఒకతను రష్యన్ భాషలో మాట్లాడేడు. అసలు కచేరీ కన్నా అతని కబుర్లే  ప్రేక్షకులలో ఎక్కువ రక్తికట్టించింది. వాళ్ల presentation గొప్పగా ఉంది. ప్రధానంగా అన్ని పాటలు. చివర drums మీద తని ఆవర్తనం కూడా చాలా రక్తిగా వాయించేడు.  రాత్రి ఒక గొప్ప concert. అందరం కలిసి. రష్యాలో భిన్న ప్రాంతాల వాళ్లూ, మేము కలిసి. మనవాళ్లు చేసింది ఒకే item – ‘పరమపురుషుడు’. రక్తికట్టింది.

ఒక రష్యన్ – ఆమె soprano అద్భుతంగా, ఆశ్చర్యకరంగా పాడింది. రష్యన్ ballet  కూడా చేసేరు. ఆ డాన్స్ సర్కస్ లా అనిపించవచ్చును. కాని కాదు. దానిలో అద్భుతంతో సౌందర్యం కూడా ఉంది. మరొకతను టేపు మీద వివిధ తాళ గతులు వాయిస్తుంటే ముస్లిం వేషధారణలో ఆడామె నృత్యం చేసింది. ఆ నాట్యంలో మన కథక్ వాళ్ళ rounds కూడా ఉన్నాయి. ఆ డప్పు వాద్యం అంత సమర్ధంగా వాయించడం వినలేదు లోగడ. చివర ఒకాయన పాడేడు. చక్కగా మన సినిమా పాటలలాగే ఉన్నాయి. రబబ్, కామొన్, ఎకార్డియన్, flute, tape చక్కటి అనుకరణ. కచేరీ మధ్య చక్కగా మాటలు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఘంటసాలగారు జ్ఞాపకం వచ్చేరు.

కచేరీ ఆఖరున అందరినీ స్టేజీమీదకి రావాలన్నారు. అప్పటికే మనవాళ్లని వేషాలు తీసేసుకొమన్నారు మాస్టారుగారు. ఆఖరికి పార్టీ లీడర్ గా ఆయనని రమ్మని చెప్పేరని లేలా చెప్పింది. లేలా ఏం చెప్పిందో పూర్తిగా ఈయన వినడు. Nothing doing అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే స్టేజీ మీద మళ్లీ తనని dance  చెయ్యమన్నారని. కాదు మహాప్రభో, స్టేజీ మీదకి తమ ఆగమనం చాలును. వాళ్లు మన బృందాన్ని గౌరవిస్తారని ఆయనకి బోధపర్చడానికి కొంత కాలం పట్టింది. తరవాత తిన్నగా చెప్పి ఏడవదుఅని లేలా మీద పునఃకోపం వచ్చింది. ఆ కోపం తెలుగులో వ్యక్తం చేసేరు మన దగ్గర.

ఏమవనీండి. కార్యక్రమం చక్కగా పూర్తి అయింది.

* Ala-Archa National Park

Located 40 km (25 miles) only south of Bishkek, the natural park of Ala Archa offers spectacular glaciers, waterfalls and high summits.

The surface of the park covers more than 200 km2 in the Kyrgyz mountain range Tian Shan. Its summits climb from 1600 m (5249 ft) to 4875 m (15994 ft) altitude with its highest peak called the Semenov Tian Shanski Peak. Ala Archa is the ideal playground for a multitude of activities, including hikeshorseback ridingskiing and of course mountaineering.

The park is named after the Ala-Archa river, which flows through its scenic gorge. Trails within the park follow this river, and hikers frequently cross bridges along the paths, including a notable "crazy bridge" on the trail to the Ak-Sai glacier. The area is known for its picturesque footbridges over the mountain river. 

Park bridges: The national park, a popular destination for visitors from nearby Bishkek, has several well-maintained bridges along its trails. Some are wooden and may sway slightly, offering an exciting crossing for those on more challenging routes.

Back in history

The Ala Archa National Park was built in 1976 to protect the important fauna and flora residing on its territory. The name Ala Archa means ”multicolored juniper” and comes from the great variety of trees and colors in the region.

This magnificent reserve is home to many animals, among which grey marmotswild goatsdeerIbexwolves. It’s also one of the only places in the world where you might just get lucky enough to see a snow leopard in its natural habitat.

** The name Frunze refers to the city's former Soviet-era name. The most prominent auditorium from that era, and the largest in Kyrgyzstan, is the Toktogul Satylganov Philharmonic Hall, often called simply the Philharmonic Hall. 

The Philharmonic Hall

Renowned performer: The hall is named after Toktogul Satylganov, an acclaimed Kyrgyz poet and composer.

Architectural significance: Completed in 1980, the building showcases Brutalist architecture with traditional Islamic ornamentation.

Large-scale venue: It houses a large concert hall that seats 1,108 and a smaller organ hall with 314 seats.

Cultural performances: It hosts a wide array of musical performances, from classical and traditional Kyrgyz music to contemporary pop.

Manas statue: In front of the building is a square featuring a statue of Manas, the legendary hero of Kyrgyz folklore.


No comments: