19-9-87
మళ్లా ఉదయం కాఫీ పెట్టుకోడం, తాగడం అయింది. ఇక్కడ వేడి నీళ్లు సంపాదించడం ఒక సమస్యగా
పరిణమించింది. సూర్యారావుగారు ఒక హీటరు సంపాదించి స్నానానికి, కాఫీకి లోటు లేకుండా
చేసారు. Breakfast అయిన తరవాత ఈ శతాబ్ది ప్రారంభంలో ఫెర్గానా లో ప్రభవించిన స్థానిక నాయకునికి
సంబంధించిన మ్యూజియం చూసాం. ఒక మిల్లు కూలీగా జీవితం ప్రారంభించి ఈ ప్రాంతాన్ని
పారిశ్రామికంగా, వ్యవసాయికంగా ఎన్నో ఘన ఫలితాలు సాధించిన అఖలంబచైవ్ జీవితం
స్మరణీయం. అతనికి సంబంధించిన సినిమా కూడా చూపించేరు.
అక్కడనుంచి ఇక్కడికి ఒక గంట ప్రయాణం చేసి ఒక సాముదాయిక వ్యవసాయ క్షేత్రానికి
వెళ్లాం. దారిలో దానిమ్మపళ్లు విరగకాచి ఉన్నాయి. మళ్ళీ తుత్రీలు, రొట్టెల దొంతరతో
స్వాగతం. మళ్లీ జలతారు టోపీలు పెట్టుకొని అమ్మాయిలు డాన్సు. మళ్లీ వాళ్ల పాటలు. మనవాళ్లని
కూడా డాన్సు చేస్తేకాని వదలరు. ఈ ఉజ్బెకిస్థాన్ లో ఉన్నంతకాలం ఈ బాధ తప్పేట్టు లేదు.
ఎలాగయితేనేం బయటపడ్డాం. రాత్రి 7 గంటలకి మా కార్యక్రమం అయింది. అన్నీ solo items. ఇంటికి వచ్చి భోజనం చేసి కూర్చుని రాస్తున్నాను. ఇక పడుక్కోవాలి. రేపు ఖాళీ. మళ్లా ఎక్కడికైనా వెళ్లాలో ఉదయం తెలుస్తుంది. 21ని ఈ ఊరు వదలాలి.
20.9.87
ఎన్ని గంటలకి నిద్రలేచినా ఉదయం 9 గంటలకి Breakfast కి హాలులో హాజరవాలి.
ఆ వెంటనే ఏదో ఒక sightseeing కి తీసుకెళుతున్నారు. ఉదయం 8 అయితేగానీ తెల్లారదు. 5, 6 గంటలకి లేవడం మన
దేశంలో సహజం. ఇక్కడ చీకటితో లేవడం అన్నమాట. అయితే అంత వేగం లేస్తేకాని
కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయడానికి వీలుండదు. ఈ హోటేలులో వేడినీళ్ల pipe లేదు. హోటేలు పనివాళ్లను
బతిమాలుకొని బకెటు, heater సంపాదించుకొన్నాం రెండు రోజులు. వేడి వేడి కాఫీ తెల్లవారుజామునే తాగాలన్నా ఇదే సమస్య. ఆఖరికి ఈ బాధ పడలేక సూర్యారావుగారు ఒక heater, తరవాత కాఫీ కాచుకొనే percolator కొని తెచ్చారు.
ఈరోజు మా స్వంత వేడినీళ్లతో కాఫీ, స్నానం పూర్తిచేసేమన్నమాట.
Beakfast పూర్తి అయన తరవాత అనుకోకుండా రష్యా సప్తతి విప్లవదినోత్సవంలో పాల్గొన్నాం.
చాలా పెద్ద stadium లో ఈ ఉత్సవం జరిగింది. ఉపన్యాసాలు తక్కువే. ప్రజల ఆటపాటలే ఎక్కువ. రష్యాలో ఉన్న వివిధ ప్రాంతాలవాళ్లే
కాకుండా ఆఫ్ఘనిస్థాన్ మొదలైన విదేశీ కళాకారులు కూడా వాళ్ల ఆటపాటలు
ప్రదర్శించేరు. అక్కడికి వెళ్లిన తర్వాత మన వాళ్లని కూడా ఆహ్వానించేరు పాటలు
పాడమని. మా వాద్యాలతో వెళ్లలేదు. చివరకి కనకదుర్గ, సూర్యారావుగారు రెండు పాటలు
పాడేరు. ఆ సందర్భానికి ఉచితమైన పాటలు
పాడితే యింకా బాగుండేది. పదిమంది కూడిన ప్రతి స్థలంలోనూ టేబిల్సు మీద బ్రెడ్,
పళ్లు, పానీయాలు ఏర్పాటయి ఉంటున్నాయి. అవి ఎవరికోసమో అనుకోనక్కర్లేదు.
కావలసినవాళ్లు తీసుకోవచ్చు.
అనేక రంగుల దుస్తులు వేసుకొని రష్యా పతాకం తీసుకొని అనేక రకాల విన్యాసాలు
చేసేరు. మొదట్లో తటస్థంగా ఉన్నా రానురాను ఆవేశంతో మనం లీనమయిపోతాం. మనిషిని మనిషి
ప్రేమించడం అనే సాధన బాగానే సిద్ధిపొందినట్టు అనిపించింది. విదేశీయుల యడల మైత్రీ,
గౌరవాల ప్రదర్శన చూస్తునే ఉన్నాం అంతటా చాలా కాలంనుంచి. కాని యిక్కడ ప్రజలు అతి
పసిపాపల దగ్గరనుంచి ఆ దృక్పథంతో పెరుగుతున్నారేమో. వాళ్ల హావభావచేష్టలు చూసి అనుకోకుండా
కళ్ల నీళ్లు వచ్చాయి.
ఇంటికి అంటే హోటేలుకి వచ్చి రెండు గంటలకు Lunch తీసుకొని ఒకమారు నడుం వాల్చేం. మళ్లా 3.20 కి బయలుదేరేం. ఇక్కడికి గంట ప్రయాణంలో ఒక sanatoriumకి తీసుకొని వెళ్లేరు. ఒక విధమైన ప్రకృతి చికిత్సాలయంవంటిది. అక్కడి ప్రధానమైన డాక్టరు మద్రాసులో కూడా ఉన్నాడట. ఇండియాలో చాలా రాష్ట్రాలలో లాగే ముఖ్యంగా అక్కడి నీటిలో శరీర రుగ్మతలను తగ్గించే లక్షణాలున్నాయట. రోగులు దేశం మొత్తం మీద వస్తారట. చాలా వరకు నీటి వైద్యమే. Sanatoriumsకి సంబంధించిన ఒక సినిమా కూడా చూపించేరు. తరవాత concert. అంటే, మామూలే. అక్కడ తార్, రుబబ్, డప్పు వాద్యాలతో ఒకావిడ పాడుతుంటే ఆ పాటకి అనుగుణ్యంగా అడుగులు, భంగిమలు ప్రదర్శించడం. ఎవరికి హుషారు పుడితే వాళ్లంతా పాల్గొనవచ్చును. మనవాళ్లు వెఱ్ఱి మొహం వేసుకొని చూస్తుంటే వాళ్లు ఊరుకోరు. మన్ని కవ్వించి రెచ్చగొట్టి చేయిస్తారు. ఈరోజు రత్తయ్యగారు ఒక వయసు మీరినావిడ వాత పడ్డారు.
ఏమైనా వాళ్ళ అతి తేలికైన నాట్యంలో అందం ఉంది. వాళ్ల కదలికలో grace ఉంది. అదే మనవాళ్లు
అనుసరించి చేదామనుకొన్నప్పుడు మనవాళ్ల కదలికలు మోటుగా ఉన్నాయి. మళ్లా మనవాళ్లు
నాట్యవేత్తలే. ఒక రకంగా అనుకోవచ్చును. పాట కూడా అలాంటిదే. మహా విద్వాంసులు ఏదైనా
చిన్న పాట పాడితే భరించలేనట్టుగా ఉండడం తెలిసిన విషయమే. తరవాత మన శైలి నాట్యం. మన
పిల్లలు ఏ వాద్యాలు లేకుండా గోవిందరాజన్ వాళ్ల డప్పు మీద వాయిస్తూ, కనకదుర్గ పాడగా
నాట్యం చేసారు. ఇక్కడి ప్రజలకి అది ఎంతో విడ్డూరం. కారణం వాళ్ల డాన్సు ఎవరైనా
వెంటనే అనుసరించవచ్చును. మన నాట్యం సాధన చేస్తేనే కాని కుదరదు కదా. అంతా చాలా
సంతోషంతో వదలకుండా కరతాళ ధ్వనులు చేసేరు.
తరవాత మళ్లా టీ, చాలా dry fruits, పళ్లు, యిత్యాదులు. రాత్రి భోజనం చేయాలనిపించలేదు. అయినా 9 గంటల తరవాత అందరూ భోజనానికి బయలుదేరితే నేనూ బయలుదేరాను. ఏదో లేదనకుండా తిని బయటపడ్డాం. రేపు ఉదయం అంటే 21, breakfast తర్వాత వెళ్లవలసిన ఊరు ‘యాండిజాన్’. ఇక్కడికి కొద్ది గంటల ప్రయాణంట. బస్సు మీద.
21.9.87
ఉదయం breakfast అయిన తర్వాత ఠంచనుగ 10.10 కి బయలుదేరాం. Andijan* State – Town తెలియలేదు. Region అంటున్నారు అలాగే Fergana గురించి కూడా. Fergana నుంచి రెండు గంటల ప్రయాణం. దారిలో Andijan region ప్రారంభంలో మళ్లా రొట్టి, బాకా, నాట్యం స్వాగతం రోడ్డు మీదే.
Bread and salt, a traditional greeting in some Slavic, Baltic, Balkan, and Middle Eastern countries
మనవాళ్ల ను కూడా వాళ్లతో డాన్సు చేయమంటారు, ఆడ, మగ, ముసిలి, పిల్ల అన్న తేడా లేదు, అందరినీ ఆడమంటారు. ఒక వేళ అలా ఆడకపోతే వాళ్లు నొచ్చుకుంటారేమో, రాజకీయంగా దేశాల మధ్య స్నేహ సంబంధాలకు వ్యతిరేకమేమిటో అనే బాధ లేకపోలేదు. ఈ విషయం మాస్టరుగారు ఆలోచించేరో లేదో. ఆయన గట్టిగా పిల్లలకి ఆజ్ఞ చేసేరు. ఎంత మాత్రం ఆడవద్దని. వాళ్లు పిలిచినా సరే. ఈ విషయం మా interpreter ద్వారా తెలుసుకొంటే మంచిదేమో.
Andijanలో Hotel బాగుంది. 24 గంటలు వేడి నీళ్లు వస్తాయిట. భోజనం తాష్కెంట్, ఫెర్గానా కంటే కూడా బాగుంది. అన్నం కావలసినంత. Bread butter, soup, చక్కటి పెరుగు, పళ్లు, ఇంకేం కావాలి. ఇక్కడి (దిబ్బరొట్టి ఆకారం) రొట్టి వేడిగా మెత్తగా ఉంది.
మధ్యాహ్నం భోజనం అయిన వెంటనే నేను పడుక్కొన్నాను. సూర్యారావుగారు మిగిలిన మిత్రులు shopping కి వెళ్లారు. మాస్టారుగారు కూడా వెళ్లేరు వాళ్లతో. పోలీసు సహాయంతో. లేకపోతే మనవాళ్ళు, ఆడపిల్లలు వాళ్ల చీరలు, బొట్టు చూస్తూ వందల కొద్దీ కడియం కట్టేస్తున్నారట. ఆఖరికి సూర్యారావుగారు, మిగిలిన వాళ్లు వట్టినే తిరిగి వచ్చేరు మరో గంటకి. ఏమైనా తిరిగి వెళ్లాలనుకొన్నారు మళ్లా. రత్తయ్యగారు, రాము, హరీ యిత్యాదులు. నేను వాళ్లతో సమంగా తిరిగే ఓపిక లేదు. అప్పుడే సూర్యారావుగారు చాలా వస్తువులు కొన్నారు. Electric-heater, Coffee-percolator, Iron. నేను కూడా కొన్నాను. సూర్యారావుగారు నన్నే కాదు అబలలను, నావంటి అశక్తులను కూడా ఆదుకొంటున్నారు ఇలాంటి విషయాలలో. దారిలో instant coffee పొట్లాలు కూడా కొన్నారు. మొత్తం అంతా 30 roubles.
నిద్ర లేచేక కొంచెం సేపు వీణ సాధకం చేసేను. వీణానాదం ఒంటరిగా కూర్చుని వాయించుకొన్నప్పుడు అనాహత నాదంతో ఆత్మానందానుభూతిని కల్గించింది.
* At more than 2,500 years in age, Andijan is the oldest city in Uzbekistan[6] and one of the oldest cities in the Fergana Valley. In some parts of the city, archeologists have found items dating back to the 7th and 8th centuries B.C.E. Historically, Andijan was an important city on the Silk Road.
The city is perhaps best known as the birthplace of Babur who, following a series of setbacks, finally succeeded in laying the basis for the Mughal dynasty in the Indian subcontinent and became the first Mughal emperor. Andijan also gained notoriety in 2005 when government forces opened fire on protestors, killing hundreds in what came to be known as the Andijan Massacre.
Bread and salt are offered to guests in a ceremony of welcome in cultures around the world. This pair of foods is particularly significant in Slavic countries, but is also notable in Baltic, non-Slavic Balkan, and Middle Eastern cultures.[1] Bread and salt as a traditional greeting remains common in Albania, Armenia, and among the Jewish diaspora. This tradition has been extended to spaceflight.[2][3][importance?] Additionally, in traditional Slavic folklore, consuming a combination of bread and salt as an offering is believed to be a powerful, last-resort method of wish-making.
The practice of offering bread and salt to guests is a widespread tradition, but it is not specific to Fergana; rather, it is a significant cultural custom in many Slavic, Balkan, and Middle Eastern countries, including parts of the Russian, Ukrainian, and Czech traditions. While the bread symbolizes prosperity and hospitality, the salt serves as a symbol of friendship, protection from evil, and the enduring nature of life's struggles and blessings.
.jpg)


No comments:
Post a Comment