Sunday, October 5, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 4 - 22-09-1987

 





 
 
 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 
- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 
రష్యా - 4

22.9.87 

ఈ రోజు మామూలుగానే ప్రారంభం అయింది. Breakfast అయిన తర్వాత Andijan ప్రభుత్వ సాంస్కృతిక శాఖాధ్యక్షుల కార్యాలయానికి తీసుకొని వెళ్ళేరు. కార్యకలాపాలన్నీ నడి వయస్సులో ఉన్న ఛాత్రమహిళ నిర్వహించింది. అనగా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఘన కార్యాలు. పక్కనే ఒక నిద్రమొహం పెద్ద మనిషి కూడా ఉన్నాడు. అక్కడ చాలా సంతృప్తికరమయిన విషయం చాలా మంచి కాఫీ తాగడం. తర్వాత అక్కడ ఉజ్బెకిస్థాన్ గ్రంధాలయం చూసేం. మనం చదివి తెలుసుకొందికి అధమం యింగ్లీషులో ఒక్క పుస్తకం కనిపించలేదు. అక్కడ పనిచేస్తున్న మనిషి వాళ్ళ భాషలో ఏదో చెప్పేడు. మా interpreter నీనా ఏదో చెప్పింది. ఆ అమ్మాయి మాట ఒకటికి  రెండు సార్లు వింటేగాని బోధపడదు నాకు. అమ్మాయి బాగుంటుంది. హావభావచేష్టలు ఫరవాలేదు. సరీ, అక్కడనుంచి ఒక మ్యూజియంకి తీసుకువెళ్ళేరు. ఆ మ్యూజియం బాబరు పేరుగా నెలకొల్పబడింది. ఆ బాబరు మన బాబరే. అతడు సమర్కండ్ ప్రాంతంలో తన రాజ్యం అన్యాక్రాంతం కాగా ఇండియా వచ్చినట్టు చరిత్రలో చదివిన జ్ఞాపకం. తరవాత మొగలు సామ్రాజ్యం భారతదేశంలో స్థిరపడడం మనకి పరిచితమయిన విషయమే. ఈ యాండిజాన్, ఫెర్గానా, సమర్కండ్*, బుఖారా** ఇవన్నీ ఈ ప్రాంతానికి చెందినవే.

బాబరుకి సంబంధించిన చిత్రపటాలు చాలా ఉన్నాయి. మన దేశంలో మొగలాయి చిత్రకళకి సంబంధించినవి భారతి పత్రికలో చూసే ఉంటాం. బాబరు మంచి రచయిత కూడానుట. బాబరునామా అనే గ్రంథం వ్రాతప్రతి కూడా భద్రపరచబడి ఉంది. ఈ మ్యూజియం శ్రీ జవహర్ లాల్ నెహ్రూ దర్శించినప్పటి ఫోటో కూడా ఉంది.

సాయంత్రం 7 గంటలకి యిక్కడ ఒక ఆడిటోరియంలో చండాలిక ప్రదర్శించేం. తాష్కెంట్ లో వచ్చినంత బాగా రాలేదు చండాలిక. కాని యిక్కడి వాళ్ళకి బాగానే నచ్చింది. ఈవాళకింతే.  

23-9-87     

ఈ ఉదయం ఎక్కడికీ అధికారికంగా వెళ్లనక్కర్లేక అలా అలా రోడ్లంట తిరిగేం. అనుకోకుండా ఒక రష్యన్ పత్రికలో మా ఫోటోలు పడ్డాయి. ఆ పెద్దమనిషి ఆ పత్రిక మాకు ఉచితంగా యిచ్చేడు. మొత్తం group ఫోటో ఒకటి, మాస్టరుగారు, కమల, శశికళ కలసి ఉన్నది పత్రికలో వేసారు. ఈ మధ్యాహ్నం 4 గంటలకి ఎక్కడో మా కార్యక్రమం ఉంది. అక్కడ లైట్లు లేవట అందుచేత 4 గంటలకి పెట్టేరట. మా పని Andijan లో ఇవాళతో సరి. అయినా యింకా 4 రోజులు ఉంటాం. బాగానే ఉంది యిక్కడ.

24-9-87

అప్పుడే మద్రాసు నుంచి బయలుదేరిన దగ్గరనుంచి blood pressure మందులు వాడలేదు. నిన్న సాయంకాలం ఏదోలా అనిపించి రాత్రి Nicardia Retard ఒక మాత్ర వేసుకొన్నాను. నిజంగా నిద్ర రావాలి. రాలేదు. ఉదయాన్ని 6 గంటలకే అంటే తెల్లవారుఝాము అన్నమాట కాల్యకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, బనియన్, డ్రాయరు ఉతుక్కొని పెట్టె సర్దుకొని కూర్చున్నాను. యింకా 8-30 అయింది. 9 గంటలకి breakfast. అక్కడనుంచి ఏ collective farms, museum తిరగాలి సాయంకాలం వరకూ.

Andijan లో dining hall ఏర్పాటు బాగుంది. 4గురేసి ఒక్కొక్క టేబిలు దగ్గర. నేను, సూర్యారావుగారు, మాలా గణపతి, కల్పలత ఒక టేబిలు. మాలకి తెలుగు అర్థం అవుతుందిట. సరే నాకు ఎలాగూ తమిళం రాదు. కల్పలత తెలుగు వచ్చునూ అంటూంది. ఇంతకీ వాళ్లతో ఘనవిషయాలు చర్చించడానికేముంటుంది భోజనం బల్ల దగ్గర. సరే రావుగారు మాస్టారుగారి దగ్గర మిగిలిన రెండు సీట్లు మారుతూ ఉంటారు. 

భోజనం దగ్గర సీను. ఆవకాయ, గోంగూర, మాగాయి, కందిపొడి, కొబ్బరిపొడి యిత్యాదులు గల సంపన్నులు ఒక్కరూ తినలేరు కదా పదిమందిలో. అందుచేత ప్రతి టేబిలు దగ్గర కొంత ప్రసాదం పంచి పెడ్తారు. కొన్ని టేబిల్సు avoid చేస్తారు. మరికొన్ని మరిచిపోతారు మాటల మధ్య.

Breakfast అయిన తర్వాత మమ్మల్ని సాయంత్రం వరకూ తిప్పేరు. మొట్ట మొదట ఒక ఆనకట్ట కాదు regulator దగ్గరకి తీసుకొని వెళ్లేరు. ఆ నది పేరు కరదరియా’***. ఆ ఆనకట్ట కట్టి రెండు పెద్ద కాలువల ద్వారా నీరు పంపిణీ జరుగుతుంది. ఆ Regulator కట్టడానికి 1 లక్ష, 65000  పనివాళ్ళు, 3 వేల మంది ఇంజినీర్లుం 45 రోజులు పట్టిందిట పూర్తికావడానికి. విజయవాడ దగ్గర బందరు కాలవ, ఏలూరు కాలవ లా ఉన్నాయి.

Kara Darya River***

తర్వాత ఏదో collective farms కి తీసుకొనివెళ్లేరు. అక్కడ ఆ farms కి సంబంధించిన మ్యూజియం చూపించేరు. రివల్యూషన్ ముందు ఉండే వ్యవసాయ పద్ధతి, దానికి సంబంధించిన పనిముట్లు, తర్వాత పొందిన అభివృద్ధి మొదలైన విషయాలు ఆ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి.  తరువాత ఆ సాముదాయిక వ్యవసాయక్షేత్రానికి సంబంధించిన recreation club లాంటిది, దానిలో ఒక మంచి auditorium ఉంది. అక్కడ మంచి concert జరిగింది. ఇంతకు పూర్వం అప్పుడే చాలా విన్నాం కానీ ఈ మాత్రం పాటలోను, వాద్యాలలోను, డాన్సులోనూ వైవిధ్యం ఈ మాత్రం ప్రమాణం ఇంత వరకూ వినలేదు. ఒక అమ్మాయి బాగా పాడింది. మగవాళ్లు కూడా బాగా పాడారు. Group dance ఆడపిల్లలు చేసేరు. రక్తికట్టింది కార్యక్రమం. అది అయిన తర్వాత భోజన కార్యక్రమం. అదీ సలక్షణంగానే పూర్తిచేసేం. ఆ తర్వాత మరికొంత దూరంలో ఒక పెద్ద పార్కులా ఉంది. అక్కడ కొన్ని వందల మంది గుమిగూడేరు. మళ్లీ తుత్తురీలు, danceలు పాటలు.

ఒకటికి వెళ్లడానికి చాలా అవసరం కలిగింది. ఈ కార్యక్రమం ఒకంతట తెమలలేదు. ఏదో ధైర్యం చేసి ఒంటరిగా బయలుదేరి పని సాధించేను. ఈ ఉజ్బెకిస్థాన్ లో అన్నీ బాగున్నాయి. అయితే lavatory లు మాత్రం ఇండియా కన్న ఉత్తమంగా లేవు. Public మరుగు దొడ్లే కాదు మంచి auditoriums లోఉన్న toilets  కూడా అలాగే ఉన్నాయి.

ఒకటి రాయడం మరిచేను. Concert ముందు ఒక aged home చూసేం. వైద్యాలయం కూడా అదే. 


** Bukhara is an ancient, historically rich city in Uzbekistan, a UNESCO World Heritage Site, and a prominent stop on the Silk Road, known for its well-preserved Islamic architecture and as a former major center of culture and scholarship. Key attractions include the Ark of Bukhara, the Kalyan Minaret, and the Samanid Mausoleum, reflecting its deep roots as a medieval cultural and economic hub.

About 140 miles (230 km) west of Samarkand in south-central Uzbekistan, Bukhara is located on the Zeravshan River, at an elevation of 751 feet (229 meters).

* Samarkand is famous for its rich Silk Road history, stunning Timurid architecture like Registan Square, and status as a major historical and cultural center of Central Asia. The city was once a vital trading hub connecting East and West and was the capital of Amir Timur's empire, a period that saw a flourishing of Islamic scholarship and art. Today, it is a UNESCO World Heritage site known as the "Crossroads of Cultures," attracting visitors with its grand mosques, mausoleums, and preserved traditions.

*** The Kara Darya (KyrgyzКара-ДарыяUzbekQoradaryolit.'Black River') is a major river in southern Kyrgyzstan and eastern Uzbekistan located in the eastern part of Fergana Valley. It is one of the two source rivers of the Syr Darya (the second largest river of Central Asia), the other source being the Naryn. Its length is 177 kilometres (110 mi), and watershed area 30,100 square kilometres (11,600 sq mi). The Kara Darya is formed by the confluence of the rivers Kara-Kulja, which rises on the southwestern slopes of the Fergana Range, and Tar.

  

 

No comments: