Click here for - రష్యా 11 - 08 -10-1987
11-10-87
అనుకొన్నట్టుగా నాలుగు గంటలకి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగి 5.30 కి
బయల్దేరేం బస్సులో. తాష్కెంట్ కి ఏడు గంటలకి చేరేం. ఉదయం తొమ్మిది తర్వాత flight నూకుస్ కి. హరిప్రసాద్ చౌరాసియా బృందం మాతోనే వచ్చేరు.
మనిషి సహృదయుడు. నిగర్వి. విమానంలోకి నేను, నా వీణా, వీటికి తోడు bag కూడా. శ్రీ
చౌరసియా నా bag అందుకొని విమానంలో తిరిగి యిచ్చేడు. నూకుస్ లో మళ్లా
తుత్తిరీలు, డాన్సులు, రొట్టెల దొంతర స్వాగతం ఉంది.
ఫెర్గానాలోను, యాండిజాన్ లోనూ మాతో ఉండిన స్థానిక
సాంస్కృతిక శాఖ ఉద్యోగి మళ్లా యిక్కడికి వచ్చేడు. మనిషి, ఏభైయేళ్లుంటాయి. దృఢంగా,
కొంచెం Stalin పోలికతో
ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతో, మాతో ఉన్న లేలాని, నీనాని తండ్రిలాంటి చనువుతో పిలుస్తూ
ఉంటాడు. అయితే మరో సమయంలో ప్రియుడుగా కూడా మారడానికి అభ్యంతరంలేనట్టుగా ఉంటుంది
అతని హావభావప్రకటన. ఇతడు యాండిజాన్ లో ఒక రాత్రి ఫిడేలు వాయించేడు తలకిందులుగా. ఇరానీ సంగీతం. అతడు ఇరాన్ వాడేట.
నూకుస్ లో హోటేలు బాగానే ఉంది. అయితే attached bath rooms లేవు అన్ని గదులకీ. విపరీతమైన చలిగా ఉంది. 11.30 దాటాకే breakfast అయింది. మధ్యాహ్నం మూడు గంటలకి dinner అన్నారు. మధ్యాహ్నం dinnerకి వెళ్లలేదు నేను, సూర్యారావుగారు. ఇక్కడ నుండి తిన్నగా
మాస్కో వెళ్లడమే. ఈ ఊళ్లో ఎన్నాళ్లుండాలో, ఎన్ని కార్యక్రమాలో తెలియలేదు. ఇటీవల
కార్యక్రమాలు సక్రమంగా లేవు కదా.
రాత్రి మళ్లా హోటేలులో కాలక్షేపానికి ఒక సరదా సంగీత సభ ఏర్పాటు చేసేరు. శ్రీ చౌరాసియా కుమారుడు, శిష్యుడు flute వాయించేరు. ఒక జానపద రీతిలో పాట. చౌరసియా కొడుకు తంబురా artist మాత్రమే అనుకొన్నాను. కాదు, ఆ అబ్బాయి చక్కగానే వాయించేడు. అసలు ఈ కార్యక్రమానికి ప్రధాన కారణం ఇరానీ పెద్దమనిషి ప్రతిభ చూపించుకోవడం. శ్రీ రావుగారి violin మళ్లా ఎరువు పుచ్చుకొన్నాడు. మిగిలినవాళ్లు ఆయనకి ఎంతకీ ఛాన్సు యివ్వరూ వాయించడానికి. ఆఖరికి ఆయనే వాయించేడు. అందరం చప్పట్లు కొట్టేం. ఎంత ఆనందించేడనీ. ముఖ్యంగా బ్రిజు మహరాజ్ పార్టీలో ఉన్న అమ్మాయి రక్తిగా పాడింది. అంతకంటే రక్తిగా ఆ అమ్మాయికి హార్మోనియం వాయించిన పెద్దమనిషి ఘజల్స్ పాడేడు. నాగరాజు, గోవిందరాజన్ వాయించేరు. శృతిలో లేదు అన్న విషయం విన్నవాళ్లకే కాకుండా వాళ్లకీ బోధపడింది. మాస్టరుగారు చాలా నొచ్చుకొన్నారు. ప్రారంభంలో శ్రీ సూర్యారావుగారు flute అయిన తర్వాత ఝంఝూటి జావళి చక్కగా పాడేరు. బాగుంది.
12-10-87
నిన్న ఉదయం పదకొండు గంటలకి నూకుస్ యూనివర్సిటీని
సందర్శించేం. కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీట. ఇంకా భవన నిర్మాణం పూర్తికాలేదు.నూకుస్ రష్యాతో విలీనమైన రిపబ్లిక్ ట. కారాకల్పాక్స్థాన్ రిపబ్లిక్ కి నూకుస్ capital.
యూనివర్సిటీలో వివిధ శాఖలు, వాటి కార్యకలాపాలు విశదపరిచేరు. తర్వాత తేనీరు సేవనం. తర్వాత యూనివర్సిటీలో auditorium లో సాంస్కృతిక కార్యక్రమం. చాలామంది యూనివర్సిటీ విద్యార్థులే అనుకొంటాను. కార్యక్రమం మహా చురుకుగా సౌహర్ధ ప్రదర్శనతో రక్తిగా నడిపించేరు. నూకుస్ ప్రాంతీయ ఆటపాటలతో రష్యాలోని వివిధ ప్రాంతీయ నృత్యాలను, పాటలను పాడారు. పిల్లలంతా బాగున్నారు. విచిత్రవేషధారణలో హుషారుగా నాట్యం చేసేరు.
చివర భారతీయ కళల యడల రష్యాలో ఉన్న ఆసక్తి వ్యక్తం చేస్తు ఒక రెండు పాటలు పాడమన్నారు. యూనివర్సిటీలో బ్రిజుమహరాజ్ పార్టీ, మాదీ, చౌరాసియా పార్టీ అన్నీ కలిసే ఉన్నాయి.
బ్రిజుమహరాజ్ పార్టీ నాయకురాలు సాస్వతీ సేన్ తెలివైన పిల్ల. బ్రిజుమహరాజ్ ప్రస్తుతం రష్యాలో లేరు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయేరుట. తిరిగడానికి ఓపిక లేక. ప్రస్తుతం బ్రిజుమహరాజు కొడుకు, సాస్వతీ సేన్ వీళ్లే పార్టీ నాయకులు. సాస్వతీ సేన్ చక్కగా మాట్లాడింది యింగ్లీషులో. అంటే ఉచితంగా. తర్వాత వాళ్ల పార్టీ అందరూ కలిసి ఒక భజన్ song తర్వాత రష్యా భాషలో ఉన్నపాట, వీళ్లు ప్రత్యేకం యిక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకొన్న పాట, పాడేరు. కూచిపూడి బృందం కూడా బృందగానంలో చేరేరు. తర్వాత మాస్టరుగారు మన పిల్లలకి కూడ ఇక్కడ డ్యాన్సు చేసిన అమ్మాయిల డ్రస్సు వేసి వాళ్లందరి ఫోటోలు తీయించేరు. బాగా కాలక్షేపం జరిగింది.
.jpg)






No comments:
Post a Comment