Saturday, October 25, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 7 - 29-09-1987

 




 
 
 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 
- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 7

29-09-1987

ఉదయం ఏదో బట్టల factoryకి* వెళ్లాలన్నారు. సరీగా 11 గంటలకి. ఈలోగా పారిజాతం రిహార్సల్సు చేయడం మంచిదనుకున్నారు. ఆఖరికి 11.30 కి వెళ్లాం. సకాలంలో వెళ్లకపోతే అందరికీ నిరుత్సాహంగానే ఉంటుంది. అక్కడవారి మొహాలలో అటువంటిది కనిపించింది. ఏమవనీండి factory అంతా చూపించేరు. సిల్కు బట్ట తయారీ యంత్రశాల – సిల్కు దారం తీయడం దగ్గరనుంచి అంటే మల్బరీ చెట్లకు పురుగులకి పెట్టిన పోషణ కాయలు  ఉడకబెట్టి దారం తీయడం, సరిచేయడం, మగ్గాలకెక్కించడం, బట్ట తయారవడం, వాటిమీద వివిధ రకాల డిజైనులతో రంగురంగులతో బట్ట, బేళ్ల కొద్దీ తయారవడం క్రమంగా చూసేం. చాలా పెద్ద factory. ఇప్పటికి రష్యాలో అనగా ఉజ్బెకిస్థాన్ లో జోళ్ళ factory, చారల, రంగుల సిల్కు factory, ఇది మూడోది. అయితే ఈ factory లో వివిధ రకాలు సిల్కు,మామూలు పట్టు, షిఫాన్, ఇంకా యేవో రకాలు అన్నీ తయారవుతాయి. పూర్వం చూసిన బట్టల factory లో ఒకటే డిజైను. ఇక్కడ అలాకాదు. అనేక రకాలు.

Osh is one of the oldest cities in Central Asia and was a significant trading post on the Silk Road, dating back to the 8th century

చివర మాకు విశ్రాంతికి తీసుకొనివెళ్లి పానీయాలు, పళ్లు యిచ్చి జ్ఞాపక చిహ్నంగా పట్టు రుమాలు, సిల్కు గుడ్డ మీద 1988 కేలండరు యిచ్చేరు. వచ్చిన పని అయిపోయింది. దస్ విదాన్య చెప్పి బస్సు ఎక్కిపోయాం. రాత్రి పారిజాతం అయింది.

30-09-1987      

ఈవాళ సరస్వతీ పూజ. నాగరాజన్ గారు మా అందరి వాద్యాలకీ పూజ చేదామని ప్రతిపాదించేరు. మంచిదీ. కొంత కాలక్షేపం.

ఈ ఊరి పేరు Osh. కిర్గీజియా State. State కి ముఖ్యపట్నం Frunze. రేపు వెళతాం అక్కడికి flightలో. ఉజ్బెకిస్థాన్ వదిలేసాం, Osh రాగానే. ఈ కిర్గీజియాలో తుత్తురీలు, డప్పులు, డ్యాన్సులు లేవు. ఇది చైనా border. చాలామందిలో చైనీస్ పోలికలు ఉన్నాయి.       

పొరపాటు. ఇక్కడా తుత్తిరీలు ఉన్నాయి. ఎలా తెలిసిందయ్యా!

10 గంటలకి ఇక్కడికి 36 కిలోమీటర్ల దురంలో ఉన్న సాముదాయిక వ్యవసాయక్షేత్రానికి తీసుకొని వెళ్లేరు. అక్కడ మళ్లా తుత్తిరీలు, బాకాలు, రొట్టెల దొంతరలతో స్వాగతం చెప్పేరు. డాన్సులూ ఉన్నాయి. అయితే ఉజ్బెకిస్థాన్ వాళ్ల దుస్తులకి భిన్నమయిన దుస్తులు**.       

  

**Kyrgyz traditional dance clothing is rich in color and includes elements like the chapan (a robe), chyptama (a velvet vest), long dresses for women, and the ak kalpak (a white felt hat) for men. For women, married and unmarried clothing differs, and both sexes wear long boots and are often adorned with silver and colorful embroidery. This video explains the history and revival of the Black Stallion dance, showcasing traditional Kyrgyz dance clothing: https://youtu.be/J2V9DtAGBAU?si=VVDUrEnFhdflYoHE

వీళ్లకీ సంప్రదాయ దుస్తులు ఉన్నాయి. వీళ్లవి రంగు చారికల పట్టు దుస్తులు కావు. మన స్కూళ్లలో అంటే conventsలో పిల్లలచేత డాన్సు చేయిస్తాం, తెల్లటి frock కుట్టించమంటారే – అంటే చిll శాలికి ఒకమారు కుట్టించామే చిన్నప్పుడు అలాంటివి. పైన రంగు వేస్టుకోటులాంటివి వేసుకొన్నారు.

సరే వ్యవసాయ క్షేత్రం విశేషాలు మామూలే. ఆ వ్యవసాయ క్షేత్రం ఎప్పుడు పారంభం అయినదీ, ప్రారంభంలో నాయకత్వం వహించిన ప్రముఖులు, తర్వాత ఫోటోలు, వాళ్లు వ్యావసాయికంగా సాధించిన achievements తెలియజేస్తారు. అక్కడి సాంస్కృతిక అభ్యుదయం అక్కడి పిల్లల స్కూళ్లు, గ్రంథాలయాలు, మ్యూజియంలు, సంగీత పాఠాలు, డాన్సు పాఠాలు యిలాంటి వాటితో lunch సమయం దాకా తిప్పుతారు. తర్వాత lunch.

ఇవాళ చిత్రం ఏమిటంటే, భోజనం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అయితే వాళ్లు యిచ్చిన cream ఏదో వెగటుగా ఉంది. వెగటు అంటే అదీకాదు. దానిలో కోడిగుడ్డు కలిసిందా అనే మీమాంస వచ్చింది. ఇంకా భోజనాలు పూర్తికాకుండానే ముగ్గురు నలుగురు వాంతి చేసుకోడానికి వెళ్లేరు. నేనూ ఆ cream తిన్నాను. నాకూ, సూర్యారావుగారికి ఏమీ కాలేదు. వీళ్లంతా కక్కుకుంటూ ఉంటే మనకి మాత్రం ఎందుకు ఉండదు అనే అనుమానం వచ్చి తిరుగుదలలో బస్సులో నాకు కూడా ఏదోలా అనిపించింది. ఏమీ జరగలేదు. ఎందుకైనా మంచిదని unienzyme వేసుకొన్నాను. అందరిలోకీ  హడావిడి చేసింది కనకదుర్గకి. నిజానికి వాంతులు ఎక్కువ అయినది జయప్రియకిట.

సరీ, రేపు ఉదయం మరో ఊరు. అంటే Frunze. ఇక్కడికి flightలో 45 నిమిషాలుట. కిర్గీజియాకి అది ముఖ్యపట్నం. మరో విషయం ఇందాక వెళ్లిన వ్యవసాయ క్షేత్రంవాళ్లకి చక్కటి auditorium ఉంది. వాళ్లకి మంచి ఆర్కెస్ట్రా ఉంది. సంప్రదాయపు వాద్యాలు  డప్పు, రుబబ్, తార్, ఖామోనాలతో బాటు సింతసైజరు,  drums కూడా ఉన్నాయి.

అక్కడి స్థానిక కళాకారులు పాటలు, ఆటలు చూపించేరు. తర్వాత మమ్మల్ని ఏదైనా చూపించమన్నారు. కనకదుర్గకి వంట్లో బాగులేదు కదా. సరే, గోవిందరాజన్ డప్పు తీసుకొన్నారు. మాస్టారుగారు పాట. అక్కడ సింతసైజరు ఉంది. దానిలో ఆర్గన్ combination తీసుకొని నేను వాయించేను. ఫరవాలేదు రక్తి కట్టింది. తర్వాత వాళ్లు మాకు పుష్పగుచ్ఛాలు యిచ్చేరు. పుష్పగుచ్ఛాలు అలా యిస్తునే ఉంటారు. జాగ్రత్త చేసుకోలేం. తర్వాత అందరికీ ఫోటోలు అలా తీస్తునే ఉన్నారు వచ్చిన దగ్గరనుంచి. అప్పుడప్పుడు వాళ్ళు తీసిన ఫోటోలు యిస్తూ ఉంటారు కూడా. తర్వాత చక్కటి souvenir  యిచ్చేరు.

 
The Russian Relic
నలభైయేళ్ళనాటి రష్యా యాత్ర జ్ఞాపిక

* అది ఏదో బట్టల factory కాదు. చారిత్రకంగా చాలా ప్రాముఖ్యత ఉన్న స్థలం. 

Osh, Kyrgyzstan, has a long history as a silk production center, and a silk factory, the Osh Silk Combine, existed there since 1928, which was established after a Moscow-based silk-weaving factory was evacuated to Osh during World War II. The Osh Silk Combine produced silk threads and parachute fabric for the war effort and continued silk and cotton textile production after the war. 

Osh Silk Combine - The Oldest Enterprise of the Light Industry in Kyrgyzstan – The Grenaž Plant of the City of Osh –
The leaders of the republic, region, and city focused primarily on the creation and development of industry as the basis of the entire economy of Osh. The Osh Silk Factory — the oldest enterprise of the light industry of Kyrgyzstan — was founded in 1925. The Osh Grenaž plant is one of the pioneers of the republic's industrialization. The Grenaž plant in the city of Osh was built in 1927 in connection with the development of sericulture in the geographical region. The plant produced high-quality industrial and breeding grena — the eggs of the mulberry silkworm — and supplied it to sericulture farms in Central Asia and Kazakhstan. On average, 600 to 1000 kg of grena were shipped annually.

The silk factory was built in 1928. It included a cocoon-reeling and silk-weaving factory and was a large enterprise for the production of grena and silk fabrics. From 1928 to 1941, a settlement with a polyclinic, schools, a club, and other cultural institutions grew around the factory. The years 1941 — 1945 represent a special heroic page in the life of the factory. In 1942, during the first winter of the Great Patriotic War, one of the silk-weaving factories from the Moscow region — the Rakhmanovskaya — was evacuated to the deep rear of the country, to the city of Osh. 

No comments: