27.09.87
అనుకొన్న రేపు రానే వచ్చింది. ఉదయం 10.30కి బయలుదేరేం. మరో చిత్రం – 26వ తేదీ –
అంటే నిన్నటి నుంచి యిక్కడ కాలమానం మార్చేరు. ఒక గంట వెనక్కి జరిపేరు. అంటే పూర్వం
9 గంటలకి breakfast అయితే యిప్పుడు ఈ మార్పువల్ల పూర్వపు 10 అవుతుందన్నమాట. ఈ మార్పు మనకి
అనుకూలమే. లేకపోతే మరీ వేగం breakfastకు హాజరుకావలసి వచ్చేది.
ఈ కొత్త ఊరు పేరు Osh* – ఓష్ ట. ఈ region కిర్గీజియా. ఈ ఊళ్లో 4 రోజులుండాలి. రెండు కార్యక్రమాలు. ఈ ఊరు పరిశుభ్రంగా
ఉంది. అసలు మన ఉష్ణమండలం దాటితే వాతావరణంలో ఏదో freshness కనిపిస్తుంది.
రష్యాలో ఈ ప్రాంతాలు బస్సు మీద వెళుతున్నప్పుడు మన ఇండియాలో ప్రయాణం చేస్తున్నట్టే
ఉంది. అంటే చిన్నచిన్న ఊళ్లు దారిలో తగులుతాయి. అయితే కిళ్లీకొట్లు, కాఫీ బడ్డీలు
లేవు. ఇళ్లు మామూలు ఇళ్లే. రేకుల కప్పులు. చాలా చోట్ల మట్టి గోడలు. మన గుమ్మడి
పాదులలాగే ద్రాక్ష తీగలు యింటి ముందు. చూడడానికి మన పల్లె వాతావరణం కనిపిస్తుంది.
ఈ ఊళ్లో మేం దిగిన హోటేలు పరిశుభ్రంగా ఉంది. బాత్ రూం, పక్కలు, దుప్పట్లు,
అన్నీ బాగున్నాయి. కొత్తగా ఉంది. గోడకి చక్కుటి painting, ప్రకృతి దృశ్యం. సరే
భోజనం మామూలే.
సాయంత్రం దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్లేం. వీధులు, పార్కులు జనసమర్థంగా లేవు.
పార్కు విశాలంగాను, పెద్ద ఎత్తైన చెట్లతోను ఉంది. యింత తిన్నటి ఎత్తైన చెట్లు మనకి
లేవు. అమెరికాలో కూడా చెట్లు, ప్రకృతి
యింకా ఆకర్షణీయంగానే ఉంటాయి. మరో చిత్రం – అమెరికాలో ఏ నీటి వనరు – అంటే కొలనుగానీ, చెఱువు గానీ ఏది
చూసినా ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. ఉంటాయి. ఇక్కడ చెరువులు, కాలవల్లో
బురద నీరుకనిపిస్తుంది. అక్కడక్కడ నడిచే ప్రదేశాలు కూడా బురదతో అసహ్యంగా కనపడతాయి.
పార్కుల్లో చూడముచ్చటగా జనం
కనిపించేరు. పసిపిల్లలను ఎత్తుకొని తల్లులు, తండ్రులు కనిపించేరు. మాకు ఇద్దరు దసలు పడ్డారు. మన దేశం
గురించి ఏవో ఏవో అడిగేరు. వాళ్లకి బొంబాయి, కలకత్తా, మద్రాసు పేర్లు తెలుసును.
రవీంద్రనాథ్ టాగూరు పేరు తెలుసును. సరీగా ఆ సమయంలోనే టాగూరు గీతం ఒకటి రేడియోలో
వినిపిస్తూంది. బహుశః ఆ పాట రష్యన్ అనువాదం అనుకొంటాను. కారణం అది బెంగాలీలా లేదు.
వాళ్లని మనని కలిపిన బాంధవ్యం బాబరు పేరుమీదుగా. బాబరు యాండిజాన్ కి 50 కిలోమీటర్ల
దూరంలో పుట్టేడట. ఆఖరికి ‘దస్ విదాన్య’ – goodbye చెప్పి తిరిగి హోటలుకి వచ్చేం.
ఈ ఊళ్లో ‘పారిజాతం’ చేయాలని మాస్టరుగారికి సంకల్పం కలిగింది. MS Raoగారికి అంత రుచించలేదు. రెండూ, అంటే రెండు కార్యక్రమాలలో ఒకటి రుక్మిణీకల్యాణం, రెండోది పారిజాతం అయితే రెండూ కృష్ణుడి పరంగా ఉంటే ఎలాగ అని ఆయన ఆక్షేపణ. అయితే ఏం కొంప మునిగింది, పారిజాతంలో నాట్యభాగం ఎక్కువ, బాగానే ఉంటుంది, ఫరవాలేదన్నారు మాస్టరుగారు.
సరే, పార్కునుంచి రాగానే కొంతసేపు పారిజాతం రిహార్సలు. రాత్రి బాగానే
నిద్రపట్టింది. యాండిజాన్ లో కన్న యిక్కడ కొంచెం చలి ఉంది. సుఖమైన చలి.
28.9.87
ఈరోజు ఉదయం sight seeing కి తీసుకొనివెళ్లేరు. చెట్లు చేమలు లేని కొండ. మన రాయలసీమ కొండలలాగ. ఒక చిన్న తోటలాంటిది ఉన్నా అది artificialగా పెంచినది. ఆ కొండ పేరు ‘సులేమాన్’. ఒక పైగంబరు పేరుగా ఆ కొండకి ఆ పేరు వచ్చిందట. ఆ కొండలో కొంత భాగం అంటే అడుగు భాగం విచిత్రమైన గుహలుగా రూపొందించేరు. అడుగు భాగం అంతా mosaic flooring. సహజమైన కొండగుహల ఆకారం. ఆ గుహలకు మాధ్యమిక యుగ ముస్లిం అలంకారం. ఎన్నో గాజు లస్టరులు వేళాడుతూ ఉంటాయి.
![]() |
| సులేమాన్ మ్యూజియం |
*Osh (/ɒʃ/, Kyrgyz: [ɔʃ], Russian: [oʂ]) is the second-largest city in Kyrgyzstan, located in the Fergana Valley in the south of the country. It is often referred to as the "capital of the south".
Osh has two main museums: the Sulaiman-Too Museum Complex, a national historical and archaeological museum located on a sacred mountain, and the Osh Regional Museum of Fine Arts, which houses local and Soviet-era artwork. The Sulaiman-Too museum is unique, as it incorporates both man-made caves and natural caverns that have been used for worship for centuries.
https://youtu.be/DYYm9ExrxHs?si=1muz2ejklGlcVgnG
.jpg)





1 comment:
కీ. శే. సంగీత రావు గారి రష్యా పర్యటన అనుభవాలు బాగున్నాయి.
Post a Comment